ప్రవక్తి అన్న(Anna)
లూకా 2: 36, 37, 38
బైబిల్ లో 3 వచనాల్లో మాత్రమే ప్రస్తావించబడిన అన్న చేసిన సేవ ఎంత ప్రశస్తమైనదో ఒక్కసారి చూద్దామా!
ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసింది. యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలుగాఉంది, ఆమె వయసు ఎంత? కన్యాత్వము ఎప్పుడు మొదలై ఉంటుంది? కనీసం 14 సంవత్సరాలకి అనుకుందామా? అంటే 14 + 7 + 84 =105 సంవత్సరాలు. (ఇది ఒక అంచనా మాత్రమే.)
ఆమె దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఇదీ ఆమె సేవ. ఆమె కూడా యేసుకొఱకు కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి సేవచేస్తుంది. లూకా 2: 38
ఆమె కూడ ఆ గడియలోనే (సుమెయోను యేసును కలిసినసమయంలోనే) లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఆమె ప్రవక్తి గనుక విమోచనకొరకు కనిపెట్టుచున్నవారిలో తనుకూడా ఉంది. దాదాపు 105 సంవత్సరాలు ఉన్నపుడు యేసును చూచింది. అందులో 84 సంవత్సరాలపాటు దేవాలయములో సేవచేసింది. బహుశా ఇంతకాలం సేవచేయడం చాలా అరుదు.
స్నేహితులారా! యేసు కొరకు మీ నిరీక్షణ ఎట్టిది?
మీ పరిచర్య ఎలాంటిది?
Smug Christ 8341543434
0 Comments