లూకా 2: 40, (యేసు) బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయన మీద నుండెను.
లూకా 2: 42, ఆయన పండ్రెండేండ్లవాడైయున్నప్పుడు ఆ(పస్కా)పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి. అంటే ఆ రోజులలో ఇజ్రాయేలియులందరూ ప్రతీ సంవత్సరం యెరూషలేమునకు వెళ్లే అలవాటు ఉండేది.
లూకా 2: 52, బాలుడైన యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యులదయయందును వర్ధిల్లు చుండెను. అంటే యేసు క్రీస్తు ప్రభువు వారు నజరేతులోనే యుక్త వయస్సునందు ఎదుగుతూ ఉన్నారు.
లూకా 4: 16, తరువాత (అంటే అరణ్యములో సాతానుచే శోధింపబడినతర్వాత) ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకచొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండెను. దీనిని బట్టి ఏమి అర్థమవుతోంది? యేసు క్రీస్తు వారు నజరేతులోనే పెరిగారు. అక్కడే ఎదుగుతూ ఉన్నారని వాక్యం స్పష్టంగా చెబుతుంది. విశ్రాంతి దినమందు సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నారు. యేసు జ్ఞానమందును, దేవుని దయయందును, మనుష్యులదయయందును 13 సం. ల వయస్సు నుండి 29 సం. ల వయస్సుముగిసేవరకూ వర్ధిల్లుచూ ఉన్నారు. ఇప్పుడు లూకా 2: 52ను మళ్లీ చదవండి. యేసు క్రీస్తు వారికి 30సంవత్సరాలు వచ్చాక ఏంజరిగింది?
మార్కు 1:9, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను. అంటే బాప్తీస్మంతీసుకొనే టప్పుడుకూడా నజరేతునుండే వచ్చాడని వాక్యం స్పష్టంగా చెబుతుంది.
లూకా 4: 22, అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగలమాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడుకాడా? అని చెప్పుకొనుచుండెను.
లూకా 3: 23, యేసు క్రీస్తు వారు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు;
ఆయన యోసేపుకుమారుడని యెంచబడెను. యేసుబోధలకు వారు ఎందుకు ఆశ్చర్యపడాలి? ఆయనకు అంత జ్ఞానము ఎలా వచ్చిందా అని. ఎందుకంటే ఆయన నజరేతులోని ఒక పేదవడ్రంగి అయిన యేసేపు కుమారుడిగానే ప్రజలు చూసారు. పై వచనాలు అన్నీ యేసు 30సంవత్సరాలు వచ్చేవరకూ తన తల్లిదండ్రుల వద్దనే ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. The Life of Saint Issa, the Best of the Sons of Men అనే పుస్తకంలో చెప్పినట్లుగా గాని లేదా మరికొందరు వ్రాసినట్లుగా ఆయన వేల కిలోమీటర్లు ప్రయాణంచేసి అన్ని దేశాలు తిరిగారు అనేదానికి సరియిన ఆధారాలు లేవు మరియు యేసు కృషు వారు తన సువార్త ప్రారంభించిన వెంటనే దేవాలయములోకి వెళ్లి అక్కడి గ్రంధాలు చదవటం మనం క్రిట్ట నిభందనలో చూస్తాము. అయన చేసిన కార్యములు పైన మనం మనస్సు లఘ్నం చేసి దేవుని క్రుపను పొందుదాము.
Smug christ 8341543434.....
0 Comments