Ticker

6/recent/ticker-posts

"బలులు" "నైవేద్యా లు" "అర్పణలు" ఎలా ఇచ్చేవారు.?

 


OFFERINGS, SACRIFICES, TABERNACLE

"బలులు" "నైవేద్యా లు" "అర్పణలు" ఎలా ఇచ్చేవారు.?

Old Testament.


మెసేజ్ లో పాత నిభందన గ్రంధంలో ప్రజలు దేవునికి అర్పించిన బలుల గురించినటువంటి పూర్తి విషయాలు మీకు అందిచడానికి ప్రయత్నం చేస్తాము. పాత నిబంధన గ్రంధంలో బలులిచ్చేవారు. బలిపీఠం మీద ఇచ్చే బలులు ఏంటి? అవి ఎన్ని రకాలు? ఎలా ఉంటాయి? ఎందుకిస్తారు? ఇట్లాంటివన్నీ కూడ మెసేజ్ లో మనం తెలుసుకుందాం


ఆదాము మొదటి సంతానం అయిన కెయిన్ మరియు అబెల్ అను సోదరులు దేవునికి అర్పించినప్పుడు ప్రసిద్ధ బైబిల్ కథ ప్రారంభం అయింది. కయీను తన పంటలలో కొన్నింటిని ప్రభువు సన్నిధికి తీసుకు వచ్చి బలి అర్పించాడు, మరియు హేబెల్ జంతువులను వధించి దేవునికి అర్పించాడు (ఆదికాండము 4: 3-5). పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలకు పంటలో మొదటి మరియు శ్రేష్ఠమైన భాగాన్ని తనకు అర్పణగా ఇవ్వాలని ఆజ్ఞాపించాడు (నిర్గ. 23:16; నెహెమ్యా. 10:35). ఇందులో ధాన్యం (ఉదా. 23:16; 34:22), ఆలివ్ నూనె (సంఖ్య. 18:12; ద్వితీ. 18:4), కొత్త ద్రాక్షారసం (సంఖ్య. 18:12; ద్వితీ. 18:4), తేనె (2) ఉన్నాయి. దిన. 31:5), గొర్రెల ఉన్ని (ద్వితీ. 18:4), ఫలాలు (నెహె. 10:35), మరియు వాటి మందలు మరియు మందలు కూడా (ద్వితీ. 15:19). బైబిల్ ఆధారమగా చూస్తే "పత్ర్యక్షపు గుడారాలు" కట్టేటప్పుడు అక్కడ బలిపీఠం మీద బలులు ఇవ్వడం అనేది మనం చూస్తాము. అలాగే పత్ర్యక్షపు గుడారాల సమయం నుండి  ఈ బలి విధానం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఆలయాల వద్ద కూడ ఈ బలి ఆచారం ఉండేది. అంటే "యెరూషలేము" దేవాలయంలో కూడ బలి ఆచారం కొనసాగింది. అయితే ఇప్పుడు బలులు అంటే పూర్తిగా మనం అవగాహన చేసుకోవడానికి పయ్ర త్నం చేద్దాం, పూర్తిగా చదవండి. 

"బలులు" అనేవి రెండు రకాలు. 1) తప్పనిసరి బలులు 2) స్వచంధ బలులు.  మొదటిది ఖచ్చితంగా ఖండితంగా చేయవలసినవి అంటే "పాపపరిహారార్థ" నిమిత్తము చేయవలసినవి అంటే “తప్పనిసరి విధులు లేదా “తప్పనిసరి సమర్పణలు” అంటారు. ఇక రెండవది “స్వచ్ఛంద సమర్పణలు అవి మన ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి సమర్పణలు. స్వచ్ఛంద సమర్పణలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ఇచ్చే బలులు అవి 3 రకాలు. ఇక్కడ ఈ రెండు సమర్పణలు కూడా బలిపీఠం మీద ఇచ్చేవారు. 



  1. దహన బలి:- ఈ దహనబలి "భక్తికి" "నిబద్ధతకు" అనుకోకుండా చేసేటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వతహాగా ఇచ్చేవి. 

  2. నైవేద్యం:- నైవేద్యం"సద్భావన" కోసం "కృతజ్ఞత" కోసం ఇచ్చేటువంటివి. 

  3. సమాధాన బలి:- సమాధానబలి కూడ "కృతజ్ఞత" కోసం ఇచ్చేదే. "శాంతి" "సమైక్యత" కోసము కృతజ్ఞత కోసం ఇచ్చేది అంతే కాకుండ ఈ సమాధానబలినే “అర్పణ, తరంగ అర్పణ” అని కూడ అంటారు. 


"తప్పనిసరి సమర్పణలు" అంటే ఖచ్చి తంగా ఇవ్వవలసినటువంటి పరిహారార్ధ బలులు ఇవి రెండు రకములు.

  1. పాపపరిహారార్థబలి:- పాపానికి ప్రాయశ్చిత్తం గాను అపవితత్ర నుంచి శుభ్ర పరచు కోవడానికి పాపాల నుండి శుభ్రం కావడానికి ఇచ్చేటువంటి బలిని "పాపపరిహారార్థబలి" అంటారు. వీటికి ఎద్దుని గానీ, మగ మేకని గాని, ఆడ మేకని గాని, పావురమును గాని, పిండిని గాని ఉపయోగిస్తారు. ఎద్దుని పధ్రాన యాజకుడు అర్పిస్తాడు. సమాజం మొత్తం బాగుపడాలని సమాజం కోసం పాపపరిహారార్థమై బలిగా పధ్రాన యాజకునికి ఇచ్చేటువంటి బలి ఇది. ఇక "ఆడమేక" సామాన్యులు ఇచ్చేది. అట్లాగే "పిండి" అనేదిపేదలు నిరుపేదలు ఇచ్చేది. అప్పట్లో ఎద్దులు, మేకలు, గొర్రెల వంటివి కలిగి ఉన్న వారికి ఆస్తిపాస్తులు కలిగివున్నట్లు  గనుక అలాంటివి కూడ లేనటువంటి పరిస్థితుల్లో అంటే నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళు "పిండి" ని అర్పనగా ఇచ్చేవారు, అంటే పిండితో కూడ పాపపరిహారార్థబలి లేదా ఇతర బలులన్నీ కూడ అర్పించే అవకాశం ఉంది. 


రెండవ అర్పణ విషయానికి వెళ్తే.

  1. అపరాధ పరిహారార్థబలి:- ఉద్దేశపూర్వకముగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తార్ధంగా ఇచ్చేటువంటిది,  ఎదుటి వారిని నష్ట పరిచినటువంటి వారు, చేసిన పాపము వలన  మనస్తాపం చెందినటువంటి వారు ఈ అపరాధ పరిహారార్ధ బలి చెల్లించ వలసిన  అవసరత ఉంది. అనారోగ్యులను రక్షించడం కోసం, అపవితత్ర పోగొట్టడం కోసం నష్టపరచిన వారికి తిరిగి చెల్లించాల్సిన అవసరత కోసం. (పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చేటు వంటి బలి) "అపరాధ పరిహారార్థ" బలి. 


అనగా ఇపుడు ఈ  5 బలులు రకములు అన్నమాట  

1. దహనబలి 

2. నైవేద్య బలి. 

3. సమాధాన బలి 

4. పాపపరిహారార్థబలి 

5. అపరాధ పరిహారార్థబలి. 

ఈ 5 బలులు కూడ "పాత నిబంధన" నుంచి "కొత్తనిబంధన" వరకు ఆచరణగా వస్తూనే ఉన్నాయని మనం గ్రంధాలలో చూస్తున్నాము. ఇది బలి ఆచారం. అయితే మరి బలిని ఇవ్వడానికి  వేటిని ఉపయోగించేవారు అంటే దాంట్లో బలులకు ఇవ్వడానికి ఉపయోగించేటువంటివి ఏమిటి అంటే మొదటిగా జంతువులు ఆ జంతువులలో ఎద్దులు,  ఆవులు  అని అట్లాగే రెండవ జాతి గొర్రెలు, గొర్రెపిల్లలు, మేక, ఆడమేక, మగమేక, ఇట్లా మేకలు... ఇక పక్షుల విషయానికొస్తే "పావురాలు" ఇక ధాన్యాల విషయానికొస్తే గనుక పిండితో ఇచ్చేవారు flour అంటాం. అట్లాగే "గోధుమలతో" కూడ బలి ఇవ్వొ చ్చు . అలాగే పులియని రొట్టెలు అడలు అంటే కేక్స్ , పొరలు, ఇలా చాలా రకాలు వుంటాయి. దాదాపు మనం అనుకునేది ఏమిటి అంటే బలులు అనగానే జంతువులు అనుకుంటాం. జంతువులతోనే బలివ్వాలి అనుకుంటాం కానీ జంతువులు లేని పక్షంలో లేదా తెచ్చు కోలేని స్తోమత ఉండే పక్షంలో మనం ధాన్యా లతోనూ, గోధుమలతోనూ, పులియని రొట్టెల తోనూ, కేక్స్ తోను, పొరలతోను, ఇట్లాగ ఇచ్చేవారు.


ఇప్పుడు ఈ బలుల గురించినటువంటి విషయాలు మరింత లోతుగా మరింత ఎక్కువగా అధ్యయనం చేద్దాం. ఇంకా ముందుకెళ్దాం. బలిపీఠం మీద యాజకులు 5 రకాలైనటువంటి బలులు ఇస్తారని మనం చర్చించుకున్నాం. మొదటి మూడు బలులు కూడ ఇశ్రాయేలీయుల ఇష్టపూర్వకంగా సమర్పించేవి. ఇవి సువాసన గల హోమములు అని అంటుంది  లేవియకాండము. మిగిలిన రెండు పాపములు క్షమించబడడానికి తప్పనిసరిగా చేయాలని దేవుడు ఆజ్ఞాపించినవి లేవియకాండము తెలియ చేస్తుంది. మరి ఈ ఐదు బలులలో "సమాధానబలి" అనేది చివరిగా ఆచరించబడినది. మనం దేవుని కట్టడలు అన్ని పాటించినప్పు డు ఆయన సమాధానం మనతో ఉండిపోతుంది అని అర్థమిచ్చే విధంగా  లేవియకాండము 7 వ అధ్యా యం తెలియ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ బలులకు సంబంధించిన విషయంలను లోతుగా అధ్యయనం చేద్దాము 


1.దహనబలి : మొదటిది "దహనబలి"  లేవియకాండము మొదటి అధ్యా యం దహనబలిగా నిర్దోషమైన దానిని బలిగా అర్పించాలి. ఏ దోషము లేనటు వంటి నిర్దోషమైనటువంటి దానిని అర్పించాలి. దహన బలి "పశువు" మీద చేయుంచాలి. దహనబలి పశువు యొక్క "రక్తము" బలిపీఠముచుట్టు ప్రోక్షించాలి. ఆ దహనబలి పశువును బలిపీఠము ఉత్తరదిక్కు న వధించాలి. దహనబలి పశువును యొక్క అవయవములను తీసి ఆంత్రములు, కాళ్లు, కొవ్వు బలిపీఠం మీద అగ్నితో దహించాలి.  


దహనబలి క్రీస్తు యొక్క సిలువ త్యా గానికి గుర్తుగా ఉంటుందని గ్రహించాలి, దహనబలిగా నిర్దోషమైనటువంటి దానిని అర్పిస్తారు. యేసుక్రీస్తు వారు కూడ ఏ దోషము లేని వారిగా తన్నుతాను అర్పించుకున్నాడు. "దహన బలి" జరిగించు సమయములో పశువుల మీద చేయి ఉంచాలి, అప్పుడు మనిషి చేసిన పాపములకు ప్రతిగా జంతువు మరణించేది. మనుష్యులు చేయిని ఆ బాలి అర్పించే  పశువు మీద పెట్టేవారు అంటే నా స్థానంలో అని అర్ధమిచ్చేటట్లు అక్కడ క్రియ జరిగించేవారు. అలానే "యేసుక్రీస్తు" వారు కూడ మన స్థానంలో మన పాపముల నిమిత్తము సిలువ వేయబడినాడు అని మనకు అర్ధమవుతుంది. దహన బలి పశువు యొక్క రక్తము బలిపీఠముచుట్టు కూడ ప్రోక్షించాలి. యేసుక్రీస్తు పభ్రువు యొక్క రక్తం కూడ సిలువ మీద ప్రోక్షించబడింది. అక్కడ సిలువ ఒక బలిపీఠంగా మారింది. దహనబలి పశువులను బలిపీఠము ఉత్తర దిక్కు న వధించాలి. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ఉత్తర దిక్కు న మాతమ్రే సిలువ వేయబడ్డారు. దహనబలి యొక్క పశువు యొక్క అవయవములను తీసి అంత్రములను, కాళ్లు, కొవ్వు బలిపీఠం మీద అగ్నితో దహించాలీ. అలా దహించినటువంటి తల, కాళ్లు, కొవ్వు , ఇట్లా మాట్లాడితే తల తలంపులను సూచించేవి. అంత్రములు అంతరంగములోని ప్రేమని అనురాగాన్ని సూచించేవి. 


యేసుక్రీస్తు పభ్రువు వారు కూడ ఎప్పుడూ కూడ తన సొంత తలంపులు ఇష్టము నెరవేర్చు కోలేదు. దేవుని చిత్తము నెరవేర్చేవాడు అంత్రములు అనేవి అంతరంగంలోని ప్రేమని అనురాగాన్ని సూచించేవి అంటే క్రీస్తు పవిత్ర హృదయాన్ని కలిగినవాడు అని మనకు తెలుసు. కాళ్లు అనేవి వెలుపలి నడకకు సూచించేదిగా ఉంటుంది. క్రీస్తు పాపము లేని నడకను కలిగి ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. కొవ్వు అనేది బలాన్ని సూచించేది. యేసుక్రీస్తు చిన్నతనం నుంచి తన బలమును దేవుని పని కొరకు వినియోగించారు అని మనకు అర్థమవుతుంది. దహనబలి అనేది అప్పట్లో ఇచ్చి నప్పటికీ ఇప్పటికీ అది క్రీస్తు సాక్ష్యార్థమైఉన్నది. అప్పటి నుంచి కూడ క్రీస్తు సాక్ష్యార్థమై ఆ దహనబలి ఆచరిస్తూ వచ్చేవారు. ఇప్పుడు మన శరీరముల ద్వార మనము కూడ దేవుని మహిమ పరచాలి అనే వాక్యాలు చాలా స్పష్టంగా మనకి కూడ తెలియ జేస్తున్నాయ్. మన విధి కూడ మన శరీరాల ద్వా ర దేవున్ని మహిమ పరచడం. 


2.నైవేద్యం :- పత్ర్యక్షపు గుడారాలలో ఇచ్చేటువంటి ఇంకొక బలి ఆచారం "నైవేద్యం" నైవేద్యం అనేది "గోధుమ పిండితో" తయారు చేయబడాలి. గోధుమలు అంటే గోధుమల నలుగగొట్టబడి పిండి చేయబడి,కాల్చబడిన రొట్టెమాదిరిగా ఇవ్వాలి. అలాగే గోధుమ పిండి ఎలాంటి నూకలు లేనిదై స్వచ్ఛంగా ఉండాలి. గోధుమ పిండి కలిపేటువంటి నూనె కూడ చాలా జాగత్ర్తలు తీసుకోవాలి, మంచి నూనె వాడాలి, గోధుమ పిండి పొంగనిదై పులియనిదైయుండాలి. తేనేను దాంట్లో ఉపయోగించకూడదు. తేనే వాడకూడదు నైవేద్యం మీద "సాంబ్రాణి” వేయాలి. ఈ సాంబ్రాణి అంత దహించే వరకు కూడ అంటే దహించుట ద్వార దేవుని స్తుతించాలి, ఇది నైవేద్యం అర్పించే విధానం. 


"నైవేద్యము" గోధుమల పిండి తోనేచేయాలి అని చేయబడినటువంటి అప్పడములు గానీ, పూరీలు గానీ, అర్పించవచ్చు . అలా నైవేద్యము అనేవి గోధుమపిండితో తయారు చేయబడిన అటువంటి వాటి ద్వారా అవి అర్పిస్తారు. యేసుక్రీస్తు వారు తనను గోధుమ గింజతో కూడ పోల్చుకున్నారు. ఈ యొక్క సూచన ద్వార గోధుమలు నలుగగొట్టబడి, పిండి చేయబడి, కాల్చబడిన రొట్టె చేసేటట్టుగా యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు నలుగ గొట్టబడి, జీవాహారంగా చేయబడ్డారు. కాల్చబడిన రొట్టె యేసుక్రీస్తు వారియొక్క శమ్రను సూచించేదిగా ఉంటుంది. అలాగే మనము కూడ లోకంలో అనేకమైన శమ్రలు ఎదుర్కోవాలి అని తెలియజేస్తాయ్ వాక్యాలు. గోధుమ పిండి ఎలాంటి నూకలు లేనిదైస్వచ్ఛంగా ఉండాలి అని చెప్పారు. ఇది లోపము లేని క్రీస్తు జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. గోధుమ పిండికి కలపబడేటువంటి నూనె అభిషేకమునకు గుర్తుగా ఉంటుంది ఆత్మాభిషేకానికి గుర్తు అది. యేసుక్రీస్తు వారు కూడ "పరిశుద్ధాత్మ" పూర్ణునిగా ఉన్నారు. అని మనకి బైబిల్ వాక్యాలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయ్. గోధుమపిండి పొంగనిది, పులియనిది, అయిఉండాలి. పులియని "వేషధారణ" "అతిశయము" "పాపము" "తప్పు డు భోదన" ఇలాంటివాటిని సూచించేవి అవి. అంతేకాదు "తేనె" ఉపయోగించకూడదు అన్నారు, ఎందుకు అంటే అది మానవుని స్వనీతికి సాదృశ్యంగా ఉంటది. తేనే అనేది మానవుని సొంత నీతికి యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడ స్వనీతి ఆయన పాల్పడలేదు. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చా డు. అలాగే "బంగారము" దైవత్వా నికి, "సాంబ్రాణి" ప్రార్ధనా జీవితానికి, "బోలము" "శమ్ర కు" సూచనగా ఉంటుంది. 


అందుకే ఆయనకు అర్పించారు. "బంగారము" "సాంబ్రాణి" "బోళము" నైవేద్యం మీద వేసేది "సాంబ్రాణి" సాంబ్రాణి అనేది స్థితి యొక్క స్థితి గాని "ప్రార్థన జీవితానికి" గానీ, సూచనగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిప్రార్థన జీవితం మనకు తెలుసు. సాంబ్రాణి అంతయూ దహించడం ద్వారానే దేవునికి స్తుతి చెల్లించేవారు. కాబట్టి మనము కూడ ఇతరులకు సువాసనగా మారాలి. సువాసనగా ఉండాలి. నైవేద్యమునకు చేర్చబడేటువంటి "ఉప్పు" అనేది రుచికి,  శుద్దీకరణకు, సూచనగా ఉంటుంది. ఈ నైవేద్యా నికి తగినంత ఉప్పుని కలుపుతారు. తేనె కలపకూడదు కానీ "ఉప్పు " కలపవచ్చు. అది శుద్ధీకరణ సూచనగా ఉంటుంది. మనలో కూడ లోకమునకు ఉప్పు వలే ఉంటాం. మనం కూడ లోకానికి ఉప్పై ఉన్నాం అనే వాక్యాలు బైబిల్ లో చూస్తాం. ఈ విధంగా "నైవేద్యాలు" అర్పించేవారు. ఈ నైవేద్యం అనేది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగానే అర్పించేవారని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి లక్షణాలిక్కడ కనబడుతున్నాయి. 


తప్పనిసరిగా అర్పించేటువంటి అర్పణలు చూస్తే అవి "పాప పరిహారార్థ బలి" "అపరాద పరిహార్థబలి" ఈ రెండూ కూడ పాపపరిహార్ద నిమిత్తమై జరిగించేటువంటి. అయితే యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు చేసినటువంటి ప్రాయశ్చి త్తాన్ని తెలియజేసేవి కూడ ఇవి కూడ. యేసుక్రీస్తు వారు మన పాపముల యొక్క దోషములు భరించాడు అని అనేకమైన వాక్యాలు సెలవిస్తున్నాయి ఇవి పాపానికిప్రాయశ్చిత్తం గాను అపవితత్ర నుంచి శుద్ధిచేయడం ద్వారాను అలాగే అనారోగ్యాల నుంచి అపవిత్రం కాకుండ ప్రక్షాళన కోసం, నష్టపరిచిన వారికి తిరిగి చెల్లించాల్సి నటువంటి ప్రాయశ్చి త్తం కోసం పాప పరిహారార్థ బలి అపరాధ పరిహార్థబలి కొరకు ఇవి ఇస్తారు.


యేసుక్రీస్తు వారు కూడ దేవుని ఉగత్రను పోగొట్టి మనలను పాపములకు శాంతికరమైన ఉన్నాడు, మనకు శాంతిని అనుగహ్రించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని దేవునితో సమాధాన పరిచాడు, యేసుక్రీస్తు వారు తన "ప్రాణాన్ని " "రక్తాన్ని " క్రయధనముగా చెల్లించి మనకు విమోచన కలిగించాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ  ప్రాయశ్చిత్తమును బట్టే మన పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. 


పాప పరిహారార్థబలి పొరపాటున చేయరాని కార్యా లను చేసినప్పుడు అర్పించబడేది. అందరము కూడ పాపం చేసామనేటువంటి ఈ వాక్యం మనకు తెలుసు. అందరం చేస్తున్నాం. పాపంలోనే పడుతున్నాం. పాప పరిహారార్థ బలి పశువుల మీద పాపము చేసినటు వంటి మనిషి చేతులుంచాలి ఎందుకంటే ఆ పశువులు ఈ యొక్క మనిషి ఎవరైతే పాపం చేసినటు వంటి మనిషి చేతులుంచాడో ఆ పాపం చేసిన మనిషి కొరకు ప్రాయశ్చి త్తంగా బలిచ్చేటువంటిది అని

తెలియ చెప్పడానికి పశువు మీద చేయి ఉంచేవారు. 


ఈ పాపపరిహారార్థబలి యొక్క బలి ఇచ్చి నటువంటి పశువు యొక్క రక్తము గుడారంలోని అడ్డుతెరల యెదుట ప్రోక్షించాలి. అడ్డుతెరల యెదుట ప్రోక్షించాలి. అలాగే ధూపవేదిక యొక్క కొమ్మల మీద ప్రోక్షించాలి. బలిపీఠము కొమ్ము లమీద కూడ ప్రోక్షించాలి. అడ్డుతెరల యెదుట వేయాలి. దూప వేదిక యొక్క కొమ్మల మీద వేయాలి. బలిపీఠము కొమ్ము లమీద కూడ వేయాలి. పాపపరిహారార్థబలి కోసం కేటాయించ బడినటువంటి పశువు నిర్దోషమైనదిగా ఉండాలి. ఏ దోషము లేనిదిగా ఉండాలి. 


ఇక పాపపరిహారార్థబలి ఇచ్చి న తరువాత పశువు యొక్క కొవ్వు బలిపీఠముమీద దహించాలి. మిగిలినటువంటివాటివన్ని పాల్యము వెలుపల దహించాలి. రెండు రకాలైనటువంటి దహన కార్యక్రమాలు 

1.పాల్యము వెలుపల

2.బలిపీఠం మీద 

పాల్యము వెలువల చనిపోయినటువంటి వారి అవశేషాలు మోసుకరాబడుతున్నాయి అని ఒక వాక్యం చెప్తుంది కుష్ఠు రోగులు అపవిత్రులుగా యెంచబడి పాల్యము వెలుపల నివసించేవారని మనకు తెలుసు. పాల్యము వెలుపల సకల అపవితత్ర కలదు. అనేటువంటివాక్యం కూడ కనబడుతుంది. శపించిన వారిని పాల్యము వెలుపల రాళ్ళతో కొట్టబడి చంపేయాలి. అనే వాక్యం కనబడుతుంది అలాగే యేసుక్రీస్తు పభ్రువు వారు కూడ మానవుల పాపములను మోసుకుంటూ పాల్యము వెలుపల శమ్ర పొందాడు. ప్రతిసారి బలి అర్పణ అర్పించవలసిన అవసరం లేకుండ యేసుక్రీస్తు వారు యుగములన్ని టికీ సరిపడ పరిహార్ధబలి ఒకేసారి అదికూడ పరిశుద్ధమైన మానవునిగా బలి అర్పించబడ్డారు ఇకపోతే....


3.సమాధాన బలి:-

"సమాధాన బలి" అనేది ఆచరణలో చివరిగా అర్పించేది. చివరిగా ఉండేది అని అర్ధం. మన సమాధానార్ధమై యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆయన చనిపోవడాన్ని కూడ మనం చూస్తాం. యేసుక్రీస్తు సిలువ మీద పడెను అని కూడ చూస్తాం. యేసుక్రీస్తు ద్వార మనకి శాంతి అనుగహ్రించబడింది. యేసు క్రీస్తు వారి యొక్క సమాధాన బలి ద్వార మనకు దేవునితో సమాధానం కలిగింది. దేవునితో పాలివారంగా ఉండటానికి దేవుడు అలా తయారు చేశాడు. మనం కూడ దేవునితో పోలినవారంగా మనం ఉండాలి. సమాధాన బలి కోసం పశువును ఏర్పా టు చేసినటు వంటి నిర్దోశముగా ఉండాలి. కలంకము లేనిది ఏ దోషము లేనిదిగా ఉండాలి. అన్నీ వస్తువులు అన్నీ పశువులు కూడ బలులకు కేటాయించరు అవి నిర్దోషమైనవిగా పత్ర్యేకమైనవిగా ఉంటాయ్. అలాగే గోవు గానీ, ఎద్దు గానీ, గొర్రెగానీ, మేక గానీ, ఇలాంటివి మనం చూస్తాం. గోవు, ఎద్దు, కోడె, ఇవి యేసుక్రీస్తు వారి బలాన్ని సూచించేది గొర్రె అనేది యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికాన్ని సూచించేది. మేక అనేది యేసుక్రీస్తు వారు తృనీకరింపబడిన వారు అని తెలియజేసేది. ఈ సమాధాన బలిలో కూడ బలిచ్చిన తరువాత ఈ బలి పశువు యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ కూడ ప్రోక్షించబడాలి. ప్రోక్షించేదిగా చేయాలి. 


అన్త్రమముల మీద ఉన్న కొవ్వు బలిపీఠం మీద దహించాలీ. ఈ బలిలో ఉన్న పత్ర్యేకత ఏంటి అంటే ఈ బలిలో దేవునికి యాజకునికి బలి అర్పించే వారికి కూడ భాగముంటది. అంటేబలి అర్పించిన తర్వాత దేవునికియాజకునికిబలి అర్పించేవారికికూడ భాగం వెళ్తది. ఈ పత్ర్యక్షపు గుడారంలో అందరికీకూడ ఈ యొక్క "సమాధాన బలి" ద్వా రానేవిందు చేస్తారు. విందుచేసి వారందరికికూడ పెడతారు సహవాసం వలె ఉంటదిది. మిగిలినటువంటిబలుల్లో బలి అర్పించువారికిఎలాంటిభాగం కూడ ఇవ్వలేదు. ఇవ్వకూడదు. మిగిలినటువంటివి బలి భాగాలు ఏమి ఉండవు గానీ ఈ సమాధానబలిలో మాతం్ర అందరికికూడ విందు చేసేఅవకాశం ఉంటది యాజకునికిగానీ బలి అర్పించేవారికిదేవునికి కూడ భాగాలు ఉంటాయ్ దీంట్లో..ఇప్పు డైతే మనమందరము కూడ యేసుక్రీస్తు ద్వార సంఘంలో సహవాసం కలిగియున్నాం. ఆ సహవాసాన్ని ఈ సమాధానబలి ద్వార దేవుడు మనకి కల్పించాడు. ఈ విధంగా అప్పటి పత్ర్యక్షపు గుడారంలో బలిపీఠం మీద బలులు అనేవి ఆచరణలోకి వచ్చా య్. 


ఆ తర్వాత యెరుషలేము మందిరంలో కూడ బలులు ఆచరణలోకి వచ్చా య్. అయితే ఇప్పు డైతే కొందరు అంటే అన్యులు గానీ, లేదా యూదులు గానీ,ఇలాంటి బలి ఆచారాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడ ఇప్పు డైతే ఇవి లేవు ఇప్పుడు మనం చేయకూడదు. బలులు ఆచారంలో లేవు అలాంటి "నైవేద్యాలు" "బలులు" "అర్పణలు" ఇవేమి మనం ఇవ్వవలసిన అవసరం లేదు. 


యేసుక్రీస్తు వారిద్వార మనందరికికూడ "మోక్షం" లభించింది ఆయన శాంతికరమైమనకి లోకాన్ని "పాపం" నుంచి దూరం చేసిసమృద్ధిగా మనకు అందించినటువంటివ్యక్తిగా ఉన్నాడు. మన కొరకు బలియైనటువంటివ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క బలులన్ని కూడ అంటే 5 రకాల బలులు కనిపించాయ్. అంటేఈ 5 రకాల బలులన్ని కూడ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఏర్పా టు చేయబడి యేసుక్రీస్తు వారియొక్క సాదృశ్యంగా ఇవి మనకి కనబడుతున్నాయి. అంతేకాకుండ వీటన్నిటి బదులు అంటే వీటన్నిటికి సాక్ష్యా ర్ధమై వీటన్నిటి కొరకు కూడ మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డారు. 


అందు కోసమే ఆయన బలిగా అర్పించబడిన తరువాత ఇలాంటి బలులు మరలా అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మన పాపములకోరకు బాలి అయ్యారు అనుకున్నవారు అవి చేయరు. యేసుక్రీస్తు వారు మన పాపములకోరకు బాలి అయ్యారు అని నమ్మిన వారు అందుకే బలి కార్యక్రమం చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు బలుల ఆచారం అనేది మనకు అందుబాటులో అందుకే లేదు. మనం బలులు అర్పించకూడదు. 


ఇప్పు డైతేమనకు బలి అర్పించబడినటువంటి యేసుక్రీస్తు ద్వారానే ప్రతిదీ కూడ అంటే పాప పరిహారార్ధమైగానీ, సమాధాన బలి గానీ, నైవేద్యము గానీ, ఇలాంటివన్నీ కూడ 

  • పాప పరిహారార్ధము 

  • అపరాధ పరిహారార్థము 

  • ఆరోగ్యము 

  • రక్షణ 

  • పాపానికిప్రాయశ్చి త్తము 

  • అపవితత్ర 

  • స్వస్థత 

  • నిబద్ధత ఇలాంటివన్నీ కూడ... 

  • కృతజ్ఞత 

  • సద్భా వన 

  • శాంతి 

  • సమైక్యత 

  • ఆత్మీ యత 

  • సహవాసము అన్నీ కూడ యేసుక్రీస్తు వారి ద్వా ర మాతమ్రే వస్తాయ్. కాబట్టి మనమాయన మార్గంలో ఆయన ద్వా ర ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్ళి నడుచుకున్నట్లయితే అవన్నీ కూడ మనకు వస్తాయ్.


  • బలులు ఇప్పు డు మనకు అవసరం లేదు. 

  • మొత్తంగా ఇదిపరిపూర్ణమైనటువంటి అవగాహన బలుల గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన. 

  • దేవుని యొక్క మహ ఉన్నతమైన కృపా కాపుదల మనందరికితోడుగా ఉండిబలపరచును గాక...






దహన బలి

పిలిప్పి 2:6-8 


6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని 7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను

నైవేద్య బలి

యోహాను 4:34



యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.

సమాధన బలి

ఎఫిసియులకు 2: 13-14


13, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. 14, ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను


పాపపరిహారార్థబలి 

యషయా 53:10-11; హెబ్రీ 9:26


10, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. 11, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

(హెబ్రీ 9:26) అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.

అపరాధ పరిహారార్థబలి

హెబ్రీ: 10:12


(హెబ్రీ: 10:12) ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,

However, when we come to God, we must do so in reverse order. Notice the following table with the offerings given in reverse order and their symbology explained.


Post a Comment

0 Comments