1. లూకా *పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా (లూకా 7:37) ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు *పరిసయ్కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి (లూకా 7:38) వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. (లూకా 7:40) అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. 40 వ వచినంలో మాట్లాడిన ఇతని పేరు సిమోను ఇతడు పరిసయ్యుడు.
2. (మత్తయి 26:6) యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, (మత్తయి 26:7) ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. (మత్తయి 26:9) దీనిని గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి. (మత్తయి 26:12) ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. (మత్తయి 26:6) లో ఆతిధ్యం ఇచ్చిన అతని పేరు కూడా సీమోను. అతడు కుష్ఠు రోగి
2a. (మార్కు 14:3) ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. (మార్కు 14:5) ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. (మార్కు 14:8) ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. మార్కు 14:3 లో ఇతని పేరు సీమోనే. కానీ ఇతడు కుష్ఠురోగి.
2b. యోహాను 12:1 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. యోహాను 12:3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:5 యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. యోహాను 12:7 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
చూసారా 4️⃣ సువార్తల్లో, చివరి వాక్యాల్లో యేసు ఏమన్నాడో గమనించారా
మత్తయి 26:13: సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
మార్కు 14:8: ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
యోహాను 12:7: కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
ఈ మూడు వాక్యాలను ఆధారం చేసుకొని చూస్తే, అత్తరు తో యేసుని సన్మానించిన ఆ స్త్రీ లాజరు సహోదరి మరియ.
లూకా 7:37: లూకా సువార్తలో చెప్పబడిన పాపపు స్త్రీ.( పేరు రాయబడి లేదు )
యోహాను 12:3 లో తెలుపబడినట్లుగా ఆమె - లాజరు సహోదరి అయిన మరియ వారు ఇద్దరు స్త్రీలు, ఆతిధ్యం ఇచ్చిన సీమోనులు ఇద్దరు. వారిలో ఒకరు పరిసయ్యుడు. మరొకడు కుష్ఠు రోగి.
దేవునికి స్తోత్రం.
Smug Christ 8341543434
0 Comments