Ticker

6/recent/ticker-posts

రాజు మీకు ఉత్తరమిచ్చు గాక

 *వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక*. 

       కీర్తనలు 20:8,9

         

"వారు క్రుంగి నేలమీద పడియున్నారు. ఎవరు? దేవుని యందు కాకుండా, లోకమును బట్టి అతిశయించే వారు. దేవుని యందు కాకుండా, లోకముపై ఆధార పడేవారు.  


యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. యిర్మియా 17:5,6


ధనమును బట్టి అతిశయిస్తే నాశనము. దేవునిని బట్టి అతిశయిస్తే సంవృద్ది. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు. 

       సామెతలు 11:28


లోకమును బట్టి అతిశయించే వారు భక్తిహీనులు, వారు కొంతకాలం ఈలోకంలో ఏ కష్టాలు బాధలు లేనట్టే కనిపిస్తారు. కాని, దేవుని ఉగ్రతదినాన్న వారి వేదనకు అంతం లేదు. అయితే, దేవుని బట్టి అతిశయించే వారికి వేదనలు కలుగవా? తప్పకుండా కలుగుతాయి. కాని, ఆ సమయంలో ఆయన కృప వారికి తోడుగావుండి నడిపిస్తుంది. ఎంత వరకు అంటే? నిత్య రాజ్యం చేరువరకు. 


భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది. కీర్తనలు 32:10


దేవునిని బట్టి అతిశయించే వారిని, ఆయన పైనే ఆధారపడే వారిని ఆయన రక్షిస్తాడు. వారు ప్రార్ధించినప్పుడు  ఆలకించి, సమాధానమిస్తాడు. ఆయననుబట్టే అతిశయిద్దాం! ఆయనపైనే ఆధారపడదాం! ఆయనయందే ఆనందిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Smug christ 8341543434...


Post a Comment

0 Comments