🙏 *ప్రార్థన*🙏
*మహాశక్తి సంపన్నుడా, సద్గుణ సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న యేసయ్యా, పూజార్హుడా, అత్యున్నత సింహాసనాసీనుడా మీకే వందనాలు స్తుతులు తండ్రీ. దేవా గడచిన సంవత్సరమంతా మీయొక్క మహాకృపలో భధ్రపరచి ఈ సంవత్సరపు చివరి దినము వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై వందనములు. అయ్యా ఈ దినమును చూడలేక ఎందరో గతించినప్పటికీ మీయొక్క మహాకృపచేత ఈ దినమును అనుగ్రహించి సజీవులుగా నిలిపిన తండ్రీ మీకే వేలాది స్తుతులు, స్తోత్రములు దేవా*
*దేవా మీ యొక్క కృపతో సమాధానమును నది వలె పారజేసి తృప్తి దయచేయుదునని సెలవిచ్చినందులకు మీకే వందనములు. దేవా విశ్వాసముతో, నమ్మకముతో మేము సమస్తమును పొందు విషయంలో మీ కృపను, సహాయమును నిత్యము దయచేయుము ప్రభువా. మీ సన్నిధిలో ప్రతి నిత్యము నిలిచి ఉండునప్పుడు మీరిచ్చే బహుమానాలను, స్వాస్థ్యమును సంపాదించుకునే భాగ్యము దయచేయుము తండ్రి. ఈ సమయంలో ఎందరు తమ అనారోగ్యములో, అక్కరలలో, అవసరతలలో మొఱ్ఱపెట్టుచున్నారో వారి యొక్క ప్రతి అనారోగ్యము నుండి విడుదలను దయచేయుము. వారి అక్కరలను, అవసరతలను తీర్చుము నాయనా. నిరీక్షణ గల ప్రాణములను తెప్పరిల్లజేయుము తండ్రీ. మాలోని సోమరితనాన్ని తొలగించుకుని తెల్లవారుఝాముననే మీసన్నిధిలో గడపి మీయొక్క ఆశీర్వాదములను సంపాదించుకునే భాగ్యము దయచేసినందుకు వందనములు ప్రభు*
*ఈ సంవత్సర కాలంలో జరిగిన అనేక ఉపద్రవముల నుండి, ప్రమాదకర పరిస్థితుల నుంచి, ఇబ్బంది కరమైన పరిస్థితుల నుంచి మీ దయగల హస్తములతో కాపాడుతూ వచ్చునందుకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు నాయనా. అకాల వర్షాల వల్ల అనేక ప్రాంతాలలోని ప్రజలు ఎంతో మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాయనా, వారికి చక్కని వాతావరణమును, ఇబ్బందుల నుంచి ఉపశమనమును, కోల్పోయిన నష్టాన్ని తిరిగి పొందగల కృప దయచేయుము తండ్రి. నేడు ఆదివారం ఆరాధనకు మమ్మల్ని మేము సిద్ధపర్చుకుని మీ సన్నిధిలో నిలువబడే భాగ్యము దయచేయుము ప్రభువా. మమ్మల్ని ఆటంకపర్చే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యము దయచేయుము నాయనా. దేవా ఇరుగు పొరుగు వారిని దీవించండి ఆశీర్వదించుము తండ్రీ. ఎవరెవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరెవరైతే ఇతరులు చేత ద్వేషించ బడుతున్నారో అట్టి వారిని ఈ సమయములో నీవు జ్ఞాపకము చేసుకొని వారి పక్షముగా మీ కార్యములు జరిగించుము తండ్రీ. మా యొక్క సేవకులను జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మను వారిపై కుమ్మరించి మా జీవితాలను బలపర్చుటకు, మాకు ఆదరణ కలిగించుటకు కావలసిన మీయొక్క మాటలను, తలంపులను వారి ద్వారా మాకు దయచేయుటకు సేవకులైన వారిని సంసిద్ధం చేయుము ప్రభువా*
*దేవా ఈ రోజున ఎవరెవరైతే శోధనలు,అప్పులు, వేదనలతో,అనారోగ్యం, నిరాశలతో ఈ సమయములో కృంగిపోతున్నారో వారికి యేసు పరిశుద్ధాత్మ శక్తిని, జయమును పొందటానికి సహాయము చేయుము తండ్రీ. దేవా ఈరోజంతా మాకు మనశ్శాంతిని, తృప్తిని, సమాధానము దయచేయుము తండ్రీ. దేవా మాజీవితాలలో తెలిసో తెలియక, చేసిన మా పాపములు అపరాధములు క్షమించుము తండ్రీ. దేవా మీచిత్తమైతే ఈ ఉదయకాలము మొదలుకొని దినమంతా మీ కృప దయచేయుము తండ్రీ. ఈ దినము మేము తలపెట్టిన కార్యములలో, పనులలో, మమ్మల్ని కాచి కాపాడి రక్షించుమని నా ఈ ప్రార్థనను మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ. ఆమేన్.*వందనములు *
0 Comments