సరిచేసుకొందాము ఈ రోజు.. సమర్పించుకొందాము మన ఆత్మను....
*వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి*
*మార్కు సువార్త 11:15*
*ప్రశాంత మనసు, హృదయము,కలిగిన యేసువారు ఎందుకు ఇలా ఆగ్రహంతో రగిలిపోయారు* 🤔
*రండి లేఖనముల వెలుగులో చూద్దాము*
*యాజకులకు చెందునవి*
*🔔ప్రాయశ్చిత్తము చేయగా దాని శేషము యాజకునిదగును*
పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును.
*లేవీయకాండము 5:13*
*🔔యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అగును*
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
*లేవీయకాండము 7:8*
*🔔 బోర అహరోను వారి సంతతికి చెందును*
యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.
*లేవీయకాండము 7:31*
యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
*లేవీయకాండము 23:20*
ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.
*సంఖ్యాకాండము 5:8*
*🔔యాజకుడు నిర్ణయించు వెల*
ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.
*లేవీయకాండము 27:8*
అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.
*లేవీయకాండము 27:12*
ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డ దైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.
*లేవీయకాండము 27:14*
👆👉 ఈ విధముగా పాత నిబంధనలో దేవుడు ఎన్నుకొనిన యాజకులకు దేవుడు మోషే ద్వారా వారికి చెందు వాటిని, వారి విధులను, వెలను. చెప్పి ధర్మశాస్త్రము నందు లిఖించి యున్నారు.
*👆👉 ఈ ధర్మశాస్త్రము లోని వాటిని ఎత్తిపట్టి నూతన నిబంధన లోని యాజకులు*
మందిరము వెలుపల అమ్ము వాటి వెలకు 4,లేదా5 రేట్లు ఎక్కువ వేళకు అమ్ముచు, మందిరము వెలుపల అమ్మేవి పనికిరావు అంటూ ప్రజలను పీడిస్తూ
మా దగ్గరే కొనాలి అంటూ పట్టుపడుతూ వారి ఇష్టానుసారంగా వెల నిర్ణయిస్తూ, ఉన్నారు
*👆👉వీటన్నింటినీ చూచిన యేసుక్రీస్తు వారు
దేవాలయములో వారు ఉంచిన బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి*
మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
*మార్కు సువార్త 11:17*
📖.ఆయన చూపించు లేఖనముల సత్యమును, వివరములను చూచి
*శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, *ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
*మార్కు సువార్త 11:18*
👆👉తరతరాలుగా ఇలా చేస్తూ వస్తున్న శాస్రులు, యాజకులు గడగడ వణికి, భయపడి, పారిపోయేలా
ఆయన లేఖనాలను వాడుతూ మాట్లాడుతూ తండ్రిపనిని చేసేవారు.
నోట్...మరి మన సువార్త ఎలా ఉంది. లేఖనాను సారముగా ఎముకలను కీళ్లను విభజించు రెండంచులు గల వాడియైన ఖడ్గముగా ఉందా .
పరీక్షించుకుని భయభక్తులు కలిగి ఆయన సువార్తను ప్రకటించెదము
దేవుడు వాక్యమును దీవించునుగాక.. ఆమెన్
0 Comments