Ticker

6/recent/ticker-posts

ఆత్మ శుద్ధి

*ఆత్మ శుద్ధి*ఈ సబ్బతు దినమున చేసుకొందాము!!

దేవాలయ ఆవరణములో ఉన్న గందరగోళమును ఊహించుకొనగలమా ?

గొఱ్ఱెలు - మేకల కేకలు, పావురాల రెక్కల చప్పుడు, రూకల చప్పుళ్లు, వాదనల అల్లరి ! లెక్కలు వ్రాస్తున్న మనుష్యుల తొందర !

యేసు అది చూచి - నిత్యత్వములో, జగత్తు పునాది వేయకముందే *ఆదాము పిల్లల కొరకు తన ప్రాణమును అర్పించి వారికి తీర్పు మరియు మరణమునకు బదులు కృపను, జీవమును దయచేస్తానని* చేసిన ప్రతిఙ్ఞ జ్ఞాపకము వచ్చిందేమో !

కానీ - వీటన్నిటి మధ్యలో ఎవరైనా పాపము, తీర్పు, క్షమాపణ, కృప అనే వాటిని గురించి ఆలోచిస్తున్నారా ?

*ఆరాధన సమయము* లోని ఆనందము, ఆశ్చర్యము అక్కడలేవు, వీటిల్లో కలగలసిపోయాయి! యాజకులు పరిశుద్ధ వస్త్రములు ధరించుకొని ధనవంతులను చూస్తూ, ధనముపై దృష్టి కేంద్రీకరించారు.

ప్రభువైన యేసు కన్నులు వెదికాయి - *_ఆరాధించేవారు ఎక్కడ ? దేవుని వాక్యము నందలి పవిత్రమైన భయము గలవారు ఎక్కడ ? దేవుని ముఖదర్శనము, హృదయము కొరకు కనిపెట్టుకొని ఎదురుచూచేవారెక్కడ ?అవినీతిని చూచి ప్రలాపించేవారెక్కడ ?_*

పస్కా పులియని రొట్టెల పండుగ సమీపిస్తుంది, ప్రజలు వారి గృహములను శుద్ధి చేసుకోవడము ప్రారంభించి ఉంటారు. యేసు తన తండ్రి ఇంటిని *పులిసిన పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అను వారి వలన కలిగిన అశుద్ధిని* తీసివేస్తున్నారు. ఈ తరములో ప్రభువు సంఘములో కూడా అదేపని చేస్తున్నారు. దాచబడిన పాపములను వెలుగులోనికి తెచ్చి సంఘమును గొప్ప సేవకుల పాపముల వలన కలిగిన అభ్యంతరముల మలినమునుండి పవిత్రపరుస్తున్నారు.

*_సువార్తను వారి లాభము కొరకు అమ్ముట - ఆయన సిలువను పట్టుకొని తమ్మును తామే హెచ్చించుకొనుట - క్షమాపణ దయచేసిన ఆయన ప్రేమను త్రొక్కివేయుట - ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలసియుండగా, తమ్మును తామే పూజించుకొనుట - ప్రభువు వేదనకు కారణమైన సాతానుతో చేయి కలుపుట..._*

మన కుటుంబములను, సంఘములను చూస్తున్నప్పుడు - దేవుడు ఏమి వెదకుతున్నారు ?

*ఒకరికి ఒకరు ఎదుగుటకు కారణముగా ఉండటము చూస్తున్నారా ? ప్రేమ గలిగి సత్యము చెప్పుచుండుట చూస్తున్నారా ? తగ్గింపుతో ఒకరినొకరు ఆదరించుకొనుట చూస్తున్నారా ?* 

*ఆయనను సన్మానించుటకు వస్త్రములు పరుస్తూ ఉన్న మనలను చూస్తున్నారా, ప్రభువుగా స్నేహితునిగా పిలువడము చూస్తున్నారా, లేదా ముద్దు పెట్టుకొని మోసము చేస్తుంటే చూస్తున్నారా ?*

లెంటు కాలములోనికి వచ్చాము అనగా యేసు మనలను విమోచించడానికి, జీవమును దయచేయడానికి, చెల్లించిన మూల్యము వెల కట్టలేనిది అని గ్రహించుకోవడానికి కేటాయించబడిన కాలము. పులిసిన లోకముతో ఉన్న బంధము ద్వారా కలిగిన మలినము నుండి మన హృదయముల యొక్కయు, ఆత్మల యొక్కయు శుద్ధి చేసికొనుట కొరకు ఉపయోగించుకుందాము ! 

 🏴‍☠️ పాపము చేయకుండా నిలబడగలిగిన మీ సామర్థ్యమును బట్టి అతిశయించడము తగదు. *పులిసిన చిన్న పిండి ముద్ద పిండి అంతటినీ పులవజేసినట్టు, చిన్న రాజీ మన పరిశుద్ధతనంతటినీ చెరుపుతుంది* 

మన జీవితములోని *పులిసిన పిండి యొక్క నీడను* తొలగించుకుందాము! 
పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న నూతన స్వభావమును ధరించుకుందాము !

క్రీస్తు అను పస్కాపశువు మన కొరకు వధింపబడ్డారు !! *(1 కోరింథీ 5:6-7)*

🔑 ... గనుక పాతదైన *పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.*


Smug christ 8341543433...

Post a Comment

0 Comments