Ticker

6/recent/ticker-posts

అన్నీ ఆకులే...ఫలాలేవి



"దాని యందు ( అంజూరపు చెట్టు )
ఆకులు తప్ప మరేమియు కనబడలేదు."
(మత్తయి 21:19)

వెయ్యి ఆకుల కంటే ఒక్క ఫలం శ్రేష్టమైనది. కానీ నేడు అనేక సంఘాలలో....

1. *వరాలు* తప్ప *ఫలాలు* లేవు.
2. *బోధలు* తప్ప *క్రియలు* లేవు.
3. *ఆచారాలు* తప్ప *ఆత్మీయత* లేదు.
4. *ధనముంది* తప్ప *దైవికంగా* లేరు.
5. *మందిరముంది* తప్ప *మనుషులు* లేరు.
6. *వాక్యం* వుంది కాని *సువార్త* లేదు.
7. పైకి *భక్తి* వుంది కాని *శక్తి* లేదు.
8. "వాయిధ్యాలున్నాయి* కానీ *వాయిద్య కారులు* లేరు.
9. *ఆస్తులున్నాయి* కానీ *ఆశీర్వాదం* లేదు.
10. *పాటలున్నాయి* కానీ *ప్రార్థన* లేదు.
11. *సంఘం* ఉంది కానీ *సేవ* లేదు.
12. *మనసు* ఉంది కానీ *మారుమనస్సు* లేదు.
13. *సభ్యులు* ఉన్నారు కానీ *సఖ్యత* లేదు.
14. *ఆశలున్నాయి* కానీ *ఆచరణ* లేదు.
15. *దీపం* వుంది కాని *నూనె*
లేదు.
16. *వనరులు* ఉన్నాయి కానీ *వాడకం* లేదు.
17. *మతం* ఉంది కానీ *అభిమతం* లేదు.
18. *విద్య* ఉంది కానీ *వినయం* లేదు.
19. *క్రైస్తవ్యం* వుంది కాని *క్రీస్తు* లేడు. 
20. *శ్రమ* ఉంది కానీ *ప్రేమ* లేదు.
21. *వృద్ధి* వుంది కాని *శుధ్ధి* లేదు.
22. *బైబిల్* వుంది కాని *భక్తి* లేదు.

పరీక్షించు కుందాం - సరిచేసి కొందాం.

దైవాశ్శీస్సులు!
      Smug christ 8341543434

Post a Comment

0 Comments