ప్రార్ధన అనేది మన జీవితంలో మనకు అనుకూలంగా లేని ఎలాంటి పరిస్థితినైనా
తిప్పికొట్టడానికి అవసరమైన శక్తిని మనకు ఇచ్చే గొప్ప ఆయుధం! మీరు మీ నోరు తెరిచి, మీ పిల్లలకోసం, మీ ఆరోగ్యం కోసం లేదా మీ జీవితంలోని ఏదైనా అవసరం కొరకు మోకరించి ప్రార్ధన చేసినప్పుడు
మీరు మీ జీవితానికి కావలసిన అవసరతలు తీరి శాంతిని పొందగలుగుతున్నారు. దేవుని
దయ అనే వెలుగుతో చీకటి పరిస్థితులను ఎలా అధిగమించాలో మరియు మీరు చాలా కాలంగా
పోరాడిన అననుకూల పరిస్థితులు ప్రార్ధన ఎలా సరి చేస్తుంది మరియు ఎలా తొలగిస్తుంది అని
నేను మీకు చెప్పాలిఅనుకుంటున్నాను.
మనం మాట్లాడే
మాటలకు మనం ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి ఉంది మరియు అదే పదాలను మనం దేవునికి
గొప్పగా స్తుతించడమే కాకుండా, మన జీవితాల్లో మంచి మార్పులను తీసుకురావడానికి
ఉపయోగించవచ్చు. సామెతలు 16:24 చెబుతోంది,
“ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు
ఆరోగ్య కరమైనవి” దేవుని యొక్క కృప మరియు ఆశీర్వాదాలను
వ్యాప్తి చేయడానికి అంటే మనం ఒక విషయాన్ని వర్ణించడానికి, చర్చించడానికి
మరియు సంభాషించడానికి ఉపయోగించే పదాలే దేవున్ని స్తుతించడానికి మనం ఉపయోగించాల్సిన
ఖచ్చితమైన పదాలు.
సామెతలు 18:21 మనకు “జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు” అని చెబుతోంది. కాబట్టి ప్రతిరోజూ మీరు మీ జీవితంతో మాట్లాడండి! మీ జీవితంలో మీతో ఉన్నవారిని వారి క్షేమం కొరకు ఆశీర్వదించడానికి ప్రతి అవకాశాన్ని విడువకుండా ప్రయత్నించండి మరియు ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుని ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలను గుర్తు చేసుకోండి. ఆయన ప్రేమించిన తన పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరియు తమ శరీరం లోపల ఉన్న ప్రపంచంతో సమాధానంగా ఉంచేలా చూసుకోవడం కంటే మన ప్రభువు ఇష్టపడేది ఎదీ లేదు అనే విషయం గమనించండి. అందువలన ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించండి. మన జీవితాలలో ప్రశాంతత స్థాపించే విధంగా ఒక సుస్థిరమైన అభయారణ్యం వంటి దానిని నిర్మించడానికి మీ మాటలను ఉపయోగించండి అలామీరు చేయటం ద్వారా ప్రతి మనిషికి, ప్రతి చెవికి, ప్రతి మనస్సుకు మరియు ప్రతి హృదయానికి యేసు ప్రేమను వ్యాప్తి చేయండి!
సంఖ్యాకాండము 6:23లో, “మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను" మోషే అహరోను మరియు యాజకులకు దేవుని ప్రజలను ఎలా ఆశీర్వదించాలో తెలియచేస్తున్నాడు. దేవుడు బైబిల్ గ్రంధంలో ఏ విషయాన్ని రహస్యంగా ఉంచలేదు. మీకు ఒక విషయం తెలియచేయాలని అనుకుంటున్నాను అది ఏమంటే "మీ కోసం ఒక ఆశీర్వాదం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది" దానిని ఎలా స్వీకరించాలో నేను మీకు ఇప్పుడు చెబుతాను". దేవుడు తన పరిశుద్ధగ్రంధంలో ఇలా అంటున్నాడు ద్వితియోపదేశకాండము 11:18 "కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను" ఇదే మనకు సూచన! ఇదే మీరు ప్రార్ధించే మార్గం! మరి దీన్ని ఎలా చేయమని దేవుడు చెప్పాడు? ఇజ్రాయేలియులతో చెప్పి ప్రార్ధన చేసే విధంగా చేయాలన్నారు. మన జీవితాలపై, మన వివాహాలు మరియు కుటుంబాలపై, మన ఆర్థిక విషయాలపై మనం ప్రార్ధించాలి. మనందరికీ మన జీవితంలో అవసరమైన కొంత ప్రాంతం ఉంటుంది. మనందరి జీవితాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. మీరు మీ పరిస్థితిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవాలనుకుంటే, మీరు దానిపై మాట్లాడే ప్రార్ధన చేయడం ద్వారా ప్రారంభించాలి!
జీవన విధానంలో ! ఆశీర్వాధ మాటల ద్వారా ప్రార్ధన చేసి మీ పిల్లల కోసం ప్రార్ధించడం ద్వారా వారు ఆశీర్వాధ పొందడానికి తోడ్పడుతుంది వారికి శక్తినిస్తుంది మరియు మీరు మీ పిల్లలతో ఇలా చెప్పండి “నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, అయన నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు, దేవుడు నిన్ను చూస్తాడు మరియు నీకు ఆధరణగా ఉంటాడు, అయన నీపై ప్రకాశిస్తాడు మరియు మీ ముఖం వెలుగు పొందుతుంది". ఒకవేళ ఎదినా సందర్భంలో మీ బిడ్డ నిరుత్సాహానికి గురైతే, వారిని పట్టుకుని నవ్వుతూ వుండు అని చెప్పకండి, I Bless You అని చెప్పండి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పండి అప్పుడు వారికి చిరునవ్వు వస్తుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నప్పుడు దేవుని శక్తి అతనికి కనిపిస్తుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అన్నప్పుడు అతని ముఖం మారిపోతుంది అతని విచార మొహం పోయి సంతోష కరమైన మొహం కనిపిస్తుంది. సాధారణంగా అద్దంలో చూసుకుంటూ వుంటాం కదా, మనలో కొందరు విచారంతో నిండిన మొహం కలిగి ఉంటారు. అలా విచారంతో నిండిన మొహం కలిగిన వారు అద్దంలో చూసి I Bless You అని చెప్పండి. అప్పుడు ప్రభువు మిమ్ములను ఆశీర్వదిస్తాడు, ప్రభువు మీ మొహంపై చిరునవ్వు ఉంచుతాడు, ప్రభువు నిన్ను ఆదరిస్తాడు, ప్రభువు మీ పట్ల దయతో ఉంటాడు మరియు ప్రభువు మీరు లోపలికి రావడాన్ని మరియు బయటికి వెళ్లడాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు మీతో అలా మాట్లాడటం మొదలుపెట్టారు అనుకోండి మీ విచారమైన మొహం పోయి మీ ముఖం మారడానికి సహాయ పడుతుంది. మీ మాటలకు శక్తి ఉంది అవి విషయాలను మారుస్తాయి.
ప్రార్ధనతో ఆశీర్వాదం అనేది మీ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొట్టడానికి అవసరమైన
శక్తిని విడుదల చేసే శక్తి ఇస్తుంది, మీరు మీ నోరు తెరిచి, మీ
పిల్లలపై, మీ ఆరోగ్య విషయమై లేదా మీ జీవితంలోని ఏదైనా లేదా
ఎక్కడైనా దేవుని ఆశీర్వాదం అవసరం అయినప్పుడు ప్రార్ధించండి, ప్రార్ధించడం
ద్వారా మీరు జీవితాన్ని శాంతికరంగా చేసుకుంటారు. మీరు చీకటి
పరిస్థితుల్లోకి వెలుగును తీసుకు రాగలుగుతారు మరియు మీరు చాలా కాలంగా పోరాడిన చెడ్డ
పరిస్థితిని ప్రార్ధనతో మీరు ఇచ్చే ఆశీర్వాదం నాశనం చేస్తుంది
మరియు చెడ్డ పరిస్థితిని తొలగిస్తుంది.
మీరు భగవంతుని శక్తిని
- భగవంతుని అనుగ్రహాన్ని - మీ కోసం పని చేసే దేవుని
మంచి సంకల్పాన్ని మీరు అనుభవించాల్సిన సమయం ఇది!
సంతోషముగల
మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును." Prov
17:22
0 Comments