Ticker

6/recent/ticker-posts

నిజమైన ఏడు వింతలు

యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. (కీర్తన 89:5 *NIV)

ఇప్పుడు మనం సంక్లిష్టమైన ప్రపంచంలో జీవిస్తున్నాం, మనం తరచుగా చూస్తువుంటాం గొప్ప గొప్ప విషయాలని నిజమైన ఆశీర్వాదాలు అనుకుంటాం! అయితే పిల్లల వంటి మనస్సుతో మనం చూసినప్పుడు ఈ ఆశీర్వాదాల గురించి మనం మరింత తెలుసుకుంటాము. ఈ రోజు మా సోదరులలో ఒకరి నుండి నేను అందుకున్న సందేశం ద్వారా ఒక విష్యం మీకు తెలియ చేయాలనీ అనుకుంటున్నాను, ఎందుకంటే శిశువుల నోటి నుండి కొన్నిసార్లు గొప్ప జ్ఞానం వస్తుంది!

ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. (యోబు 5:9)

ప్రపంచంలోని ఏడు వింతలు! ప్రస్తుత ప్రపంచంలోని ఏడు వింతలు అని తాము భావించిన వాటిని జాబితా చేయమని తరగతి గదిలో విద్యార్థులను టిచర్అ డిగారు. కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కింది వాటికి అత్యధిక ఓట్లు వచ్చాయి:
  1. చైనా యొక్క గ్రేట్ వాల్
  2. జోర్ధాన్ లోని పెట్రా కట్టడం  
  3. రోమ్ లోని కొలిసియం
  4. మెక్సికో లోని  చిచెన్ ఇట్జా 
  5. పెరూ లోని మాచు పిచు 
  6. తాజ్ మహల్
  7. బ్రెజిల్ లోని క్రిస్ట్ ది రిడిమర్ స్టాట్యు
అయితే, ఓట్లను సేకరిస్తున్నప్పుడు, ఒక విద్యార్థి నిశ్శబ్దo గా వుండి తన పేపర్‌ ఏమి రాయలేదని ఉపాధ్యాయురాలు గుర్తించింది, కాబట్టి ఆమె తను జాబితా రాయడానికి ఏదైనా సమస్య ఉందా అని ఆ అమ్మాయిని అడిగారు. డానికి ఆ అమ్మాయి ఈ విదంగా బదులిచ్చింది, "అవును, చాలా సమస్య ఉన్నందున నేను నా మనస్సును పూర్తిగా మార్చుకొని అందరు రాసిన విధంగా రాయలేకపోయాను." అని చెప్పింది అందుకు ఆ ఉపాధ్యాయురాలు, "సరే, నీ మనస్సులో ఏమి ఉందో నాకు చెప్పు అప్పుడు నేను నీకు సహాయం చేయగలను" అంది ఆ అమ్మాయి సంకోచంగా తన మనస్సులో అనుకున్న "ప్రపంచంలోని ఏడు వింతలు" ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టింది
  1. మనం చూడగలుగుతున్నాం
  2. మనం రుచి తెలుసుకోగలుగుతున్నాం
  3. మనం స్పర్స తెలుసుకో గలుగుతున్నాo
  4. మనం వినగలుగుతున్నాము
  5. మనం అనుభూతి పొందగలుగుతున్నాం
  6. మనం నవ్వ గలుగుతున్నాం
  7. మనం ప్రేమించ గలుగుతున్నాం
అప్పుడు ఆ అమ్మాయి మాటలకు గది చాలా నిశ్శబ్దంతో నిండి పోయింది, అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. మనం సాధారణమైనవి మరియు "సాధారణమైనవి" అని విస్మరించే విషయాలు నిజంగా అద్భుతమైనవి. చాలా సందర్భాలలో జీవితంలో అత్యంత విలువైన వస్తువులను కొనలేమని ఇది సున్నితంగా గుర్తు చేస్తుంది. దేవుడు వాటిని ఉచితంగా మనకు ఇచ్చాడు. సంతోషంగా ఉండటం అంటే ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని కాదు, మీరు లోపాలను అర్ధం చేసుకుని అధిగమించారని అర్థం. కాబట్టి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి మరియు లోపాలను దాటి చూడండి. ఆమెన్.



Post a Comment

0 Comments