Ticker

6/recent/ticker-posts

Lent Day - మొదటి రోజు భస్మ బుధవారపు వాక్య సందేశం

 లెంటు లో మొదటి రోజు భస్మ బుధవారపు వాక్య సందేశం 
లెంటు వసంతకాలం

ఉపోద్ఘాతం :- లెంటు అనేది చలికాలం తర్వాత వసంతకాలం లో నేల పగుళ్ళను చిల్చు కొని విత్తనాలు మొక్కలు గా బయటకు వచ్చి పూలు పూసి వికసించే కాలం నే లెంటు అంటారు.

అయితే వసంతకాలానికి లెంటుకాలానికి ఉన్న సంబంధం ఏమిటి ? భస్మ బుధవారం ఎలా నిర్మయిస్తారు.

భస్మ బుధవారం , లెంటు దినాలు, నలభై అను సంఖ్య గురించి కొన్ని సంగతులు పరిశిలిద్దాం

1. లెంటు కాలం పరమ : 2 : 12

దేశంలో పాపురం కూత వినబడుతూ ఉందని వేచియుండే దు:ఖసమయం అవతరించిందని తాను వస్తున్నానని ముఖం చూడని మ్మని స్వరం వినబడ నిమ్మని తనను కలుసుకోవడానికి సంఘ వధువును సిద్ధపడమని ప్రభువు చెప్తున్నాడు ఇదే ప్రభువు కొరకు లెంటు లోని సిద్ధ పాటు దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలహాలము చేయ కాలం వచ్చెను. పాపురస్వరం మన దేశంలో వినబడు చున్నది.

2. లెంటు మరియు వసంత కాలానికి ఉన్న సంబంధం

లెంటు అనేది పాత ఇంగ్లీషు పదం lencten నుండి వచ్చినది లెంటు అనగా వసంత కాలంలో అప్పటి వరకు నేలలో దాగి ఉండిన విత్తనాలు , మొక్కలుగా మారి నేలను చీల్చుకుని బయటకు వచ్చి ఎదిగి పూత పువ్వులు కాయగా మారడం అని మనం చెప్పవచ్చు అనగా హృదయం దు:ఖం లో నుండి సంతోషం చీల్చు కొని బయటకు రావడం

3. లెంటు చరిత్ర. 

క్రీ.శ. 325 సంవత్సరంలో నైసీయ అనే ప్రాంతంలో కాన్సంటైన చక్రవర్తి ఆధ్వర్యం లో జరిగిన ప్రపంచ క్రైస్తవ నైసీయ సమావేశంలో ఒక మంచి కారణం కొరకు ఈ లెంటు కాలం నిర్మయించబడింది.

దీని ఉద్దేశ్యమేమిటంటే అనుదిన జీవిత ప్రవాహంలో మానవుడు కొట్టుకుపోతూ తన అంత్య దశ ఏమిటో ఎరుగక ఉన్నాడని మనిషికి తన జీవితం శాశ్వతం కాదని ఎప్పటికైనా మన్నుకు మన్నుగా ను బూడిద కు బూడిదగాను మారాల్సిందేనన్న వాస్తవాన్ని మానవుడు గుర్తించవలసి ఉన్నది 

కానీ ఈ వాస్తవాన్ని ప్రపంచం గుర్తించే స్థితిలో లేదు ఈ జీవితం తాత్కాలికం అనే నిజాన్ని ఈ బిజీ జీవితం మరచి పోతుందని గనుక సంవత్సరం లో ఒకసారి అయినా ప్రతీ సంవత్సరం తెలియ జేయాలని ఆ చక్రవర్తి ఇది ప్రారంభించారు.

4. భస్మబుధవారం  ఎలా నిర్ణయిస్తారు.

సాధారణంగా ప్రతీ సంవత్సరం భస్మ బుధవారం తారీఖు మారుతుంటాది కారణం  క్రీం.శ.601 సంవత్సరంలో గ్రెగోరీ అనే పోపు  భస్మబుధవారంతో ప్రారంభమగు ఈ లెంటుకాలాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో ఈ భస్మం బుధవారం తారీఖును  ఫిబ్రవరి 10-మార్చి4 వి తారీఖు లోపు వచ్చేలా ఏర్పాటు చేశారు దానికి కారణం ఉంది

లెంటులో 40 దినాలు వసంతకాలం లోనే రావాలని కాన్సంటైన్ చక్రవర్తి నిర్ణయించారు.  అయితే ఋతువులు  చంద్రుని యొక్క పరిభ్రమనాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుని యొక్క పరిభ్రమనాన్ని బట్టి  వచ్చే వసంతకాల సమయం ఆధారంగా లెంటు యొక్క 40 దినాలు వసంతకాలం లోనే ఉండే విధంగా లెక్క పెట్టి సంఘంలో ఈ లెంటును నిర్నయించి దాని ఆధారంగా భస్మ బుధవారం తారాఖును నిర్ణయిస్తారు

కాబట్టి ఆ చంద్రుని యొక్క భ్రమనం వల్ల వసంతకాలం వచ్చే తారీఖులు మారుతాయి దాని వల్ల భస్మ బుధవారం కూడా మారుతుంది

5. లెంటు కాలంలో వచ్చే ఆదివారాలు లెంటు లో భాగం కాదు. 

లెంటు కాలంలో వచ్చే ఆదివారాలు ప్రభువు పునరుత్థానం దినాలుగా భావించి విమాటిని లెంటు కాలంలో లెక్కించరు ఆదివారం నాడు ప్రభువు దినము కాబట్టి సంతోషంగా ఉండాలి గనుక దుఃఖకరమైన లెంటులో వచ్చిన ఆదివారాలను లెంటుకాలం నుండి తీసెసారు.

6. లెంటు కాలం 40 దినాలు అని ఎందుకు నిర్ణయించారు? 

రెండు పదాన్ని లాటిన్ భాషలో "క్వాడ్రాగెసీమా" - "Quadragasima" అని పిలుస్తారు అనగా 40 రోజులు లేదా ఈస్టర్ ముందు అక్షరాలా 40 వి రోజు 

👉 40 అనే సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

  1. నోవాహు 40 రాత్రింబగళ్ళు ఆది :7: 17
  2. అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు సంఖ్యా : 14:33
  3. మోషే దేవుని సన్నిధి లో పర్వతం పై 40 రాత్రింబవళ్ళు నిర్గమా:24:18
  4. ఇశ్రాయేలీయులు మన్నాతో పోషింపబడ్డారు 40 సంవత్సరాలు నిర్గమా:16:35
  5. ఇశ్రాయేలీయులు మధ్య వివాదం ఏమైనా నిందితుడు తినాల్సిన దెబ్బలు 40 కొరడా దెబ్బలు - ద్వితియో:25:3
  6. వేగులవారు కనాను దేశములో 40 రోజులు సంఖ్యా:13:25
  7. గిద్యోను, ఒత్నియేలు కాలంలో దేశం 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది - న్యాయా:8:28 ,3:11
  8. గొల్యాతు 40 దినాలు  ఇశ్రాయేలీయులకు తన్ను తాను అగుపరచుకొనెను - 1 సమో:17:16
  9. సొలొమోను మందిర నిర్మాణం లో 40 అను సంఖ్య ముఖ్యమైనది -  1రాజులు:6:17
  10. ఏలియా భోజనం బలంచే 40 రోజులు పరుగెత్తాడు - 1 రాజులు:19:8
  11. యోనా నినెవె నగరం వెళ్లి 40 రోజుల తర్వాత సువార్త చేసాడు - యోనా:3:4
  12. యేసు 40 రోజులు ఉపవాస ప్రార్ధన తో సాతాను ను జయించాడు -  మార్కు:1:13
  13. యేసు క్రీస్తు పునరుత్థానం తర్వాత శిష్యులకు తన్ను తాను 40 రోజులు అగుపరచుకొనెను -  అపో:1:3
  14. యూదులు  పౌలును 5 సార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు - 2 కొరి:11:24 
  15. యేసు ఉపవాసం చేసిన 40 దినాలే లెంటుకు ఆధారం మార్కు:1:13

ఈ 40 దినాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ ఆ యేసు ప్రభు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్ధనను బట్టి ఈ లెంటు 40 దినాలు ఉపవాస ప్రార్ధన గా ఉండాలని నిర్ణయించబడింది

ఈ 40 దినాల ఉపవాసం దేనికి గుర్తు

1. నూతన హృదయం - ఆది : 7:12

నోవాహు దినాలలో 40 రాత్రింబగళ్ళు కురిసిన వర్షంకి అన్నీ తుడుపుబెట్టుకు పోయినవి. అలాగేమన జీవితంలో ఈ 40 రోజులు వాక్యం అనే వర్షం ద్వారా సమస్త చెడు నీ హ్రుదయం నుండి  తుడుపు పెట్టుకుని పోయి నూతన హ్రుదయం రావాలి

2. నూతన ధర్మశాస్త్రం - నిర్గమా:34:28

నిర్గమకాండము 34: 28: మోషే నలుబది రేయింబగళ్లు ఉపవాసం ఉండి యెహోవాతో కొండ మీద నుండినపుడు దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించెను. ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలి

3. నూతన ఆశ - సంఖ్య:13:25 

వేగులవారు 40 దినాలు కనాను దేశమును సంచరించి  నూతన ఆశ ను పొందియున్నారు, ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా ఆయన వాక్యం ద్వారా ఒక ఆశని పొందుకోవాలి

4. నూతన ప్రత్యక్షత - 1 రాజులు:19:8-9 ఏలియా ఉపవాసం ఉండి 40 దినాలు ప్రయాణం చేసిన తర్వాత దేవుని ప్రత్యేకత చూసెను, ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా దేవుని ప్రత్యక్షత చూడాలి

5. నూతన విజయం - లూకా:4:1-2

యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం తర్వాత సాతాను పై విజయం పొందాడు

ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా అనేక సమస్యల్ని జయించాలి

6. నూతన విశ్వాసం -  అపో:1:3 

ఆరోహణానికి ముందు యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమాయెను అపుడు వారికా నూతన విశ్వాసం కలిగింది

ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా  నూతన విశ్వాసం పొందుకోవాలి

7. నూతన ఆశీర్వాదం

ఈ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా  నూతన ఆశీర్వాదం పొందుకోవాలి

ముగింపు 

అయితే ప్రియులారా ఇది అందరూ భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు కేతలిక్కులు అనేక ప్రొటస్టెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఆచారంగా కాక నిజమైన భక్తి శుద్ధలతో ఆచరిస్తే అదే మన ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇవి భక్తితో ఆచరించి సంవత్సరమంతా పాపం చేస్తే అది ఆయాసం & దు: ఖం

ఈ లెంటు కాలం బైబిల్లో లేని ఆచారం అని కొందరు అంటుంటారు. కాని ఇది అనేక చర్చిల్లో జరుగుతుంది ఏది తప్పో ఏది ఒప్పో అని చూసే వాడు ఆయనే గనుక మనం సువార్త చేస్తూ ఆత్మలను రక్షించి దేవునిచే భళా! నమ్మకమైన మంచి దాసుడా అని పేరుపొందవలెను.



Post a Comment

0 Comments