Ticker

6/recent/ticker-posts

BERTHALOMAI బర్తలోమయి (నతానియేలు)

*BERTHALOMAI*

*బర్తలోమయి*

"బర్తలోమయి" మత్తయిసువార్త, మార్కుసువార్త, లూకాసువార్తలలో బర్తలోమయి అని పిలువ బడుతున్నాడు. కానీ (యోహానుసువార్తలో) మాత్రం"నతానియేలు"అనిపిలువబడుతున్నాడు.!

"నతానియేలు"అనగా *Gift of God* (దేవునియొక్కవరము) అని (దేవుని యొక్క బహుమానం) అని అర్ధం. "బర్తలోమయి" అనగా "తొలమయికుమారుడు" అని కూడా అర్ధం ఉంది. "బర్తలోమయి" అనే పదం "అరామిక్ పదం" అనగా అరామిక్ భాష  నుంచి వచ్చినటు వంటి బర్తిలోమయి అనే దానికి "తొలమయికుమారుడు" అని అర్ధం. గలలీయలోని "కానా" అనే ప్రాంతంలో తొలమయికుమారుడు అని పిలువబడుతున్నాడు బర్తిలోమయి. ప్రాంతం నజరైతుకు 5 మైళ్ళ దూరంలో ఉంది. బర్తిలోమయిగా పిలువబడుతున్న నతానియేలు ధర్మశాస్తమంతటిని చక్కగా చదివినవాడు. ఎల్లప్పుడూ దేవుని గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి ధ్యానిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ధర్మశాస్త్రము, దేవుని మరియు రాబోవు మెస్సయ్యా గురించిన ఊహలోకంలో ఉండటం ఈయనకు అలవాటు. అయితే మొట్ట మొదటి యేసుక్రీస్తు వారు నతానియేలును అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూసారు. (యోహాను సువార్త, 1:48 వచనంలో ఉంటుంది)

 

"యేసు క్రీస్తు" నతానియేలును చూసిన సంగతి ఆయన గుర్తించక ఊహలోకంలోనే విహారిస్తున్నాడు. అది ఆయన అలవాటుగా మారిపోయింది. నతానియేలుకు మంచి స్నేహితుడు పిలుప్పు. స్నేహితుడైన "పిలుప్పు" ధర్మశాస్త గ్రంధం లో మోషేయూ, పవ్రక్తలు, ఎవరి గురించి రాసారో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన "నజరేయుడుగు యేసు"అని నతానియేలుతో చెప్పాడు. నతానియేలు ధర్మశాస్త గ్రంధంను బాగా ధ్యానించేవాడు. లేఖన అనుభవం చాలా ఎక్కువ. అయితే పిలుప్పు ఈ మాట చెబుతున్నప్పుడు లేఖననుభవం గలిగినటువంటి నతానియేలు నజరేతు ఊరిలో నుండి మంచిదేదైనారాగలదా? అని పిలుప్పును సందేహంగా అడగడం జరిగింది. అయితే వచ్చి చూడమని పిలుప్పు చెప్పినప్పుడు నతానియేలు ఆసక్తి గలవాడై యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. నతానియేలును చుసిన వెంటనే యేసుక్రీస్తు వారు ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలియుడు, ఇతని యందు ఏకపటము లేదని అతని గురించిచెప్పాడు. (యోహాను సువార్త, 1:47 వచనం) ఎంతటి చక్కని సాక్ష్యము మరెవ్వరి గురించి" యేసుక్రీస్తు" వారు ఇలా చెప్ప లేదని గహ్రించండి.

         నతానియేలు గురించి యేసుక్రీస్తు  చెప్పుట విని నతానియేలు విస్మయం పొందాడు. యేసుక్రీస్తు వారి మాటలకు ఆశ్చర్యపోయాడు. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతానియేలు యేసుక్రీస్తు వారిని అడుగగా ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచితిని అని చెప్పాడు యేసుక్రీస్తు వారు.(యోహాను సువార్త, 1:48 వచనంలో ఉంటుంది.)

అప్పటికే దేవుని గురించి ధ్యానంలో నిమగ్నమైయుండిన "నతానియేలు" యేసుక్రీస్తు వారి శక్తిని గహ్రించాడు. పవ్రక్తలు చెప్పిన "మెసయ్య" ఈయనే అని విశ్వసించాడు. భోదకుడా నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజువు అని సాక్ష్యమిచ్చాడు. (యోహాను సువార్త, 1:49 వచనంలో) యేసుక్రీస్తు ను గూర్చి ఇలాగు సాక్ష్యామిచ్చిన మొదటిశిష్యుడు ఈయనే. నతానియేలు ఊహలోకంలో సంచరించడం తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు అతడు ఇంకా గొప్ప సంఘటనలు చూస్తాని ఆశీర్వదించాడు. (యోహాను సువార్త, 1:51 వచనంలో), మెడ గదిలో ఎక్కి పోయిన యేసు క్రీస్తు శిష్యులలో భర్తలోమయి కుడా ఒక్కడు (అపోస్తుల కార్యములు 1:13) నతానియేలు గురించి వేరే సంఘటనలు పరిశుద్ధ గ్రంధంలో రాయబడలేదు. ఆయన ఎటువంటి సమస్యలలోనూ చిక్కుకొనకుండ యేసుక్రీస్తు ను యధార్ధంగా వెంబడించాడని మనం తెలుసుకోవాలి. ఇతని యందు ఏకపటములేదు అని మనము సాక్ష్యము పొందుటకు "నతానియేలు" జీవితం ఒక మాదిరికరం. అయితే యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తరువాత అపోస్తులుడైన బర్తలోమయి ఉత్తర ఇండియా పడమర తట్టు వరకు (మహారాష్ట్ర లోని థానే జిల్లా)  దేవుని సువార్త ప్రకటించినట్లు కనపడుతుంది. అంతేకాదు, హైతియోఫియా, అర్మానియా, ఇండియా, మెస్పటోమియా, పర్జీయా, ప్రిగ్గి, మొదలైన ప్రాంతాలలో "బర్తలోమయి" సువార్త సేవను జరిగించాడు.

అపోస్తులుడైన "బర్తలోమయి" ఉత్తర ఇండియా పడమర తట్టు వరకు వచ్చి సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆయన హెబ్రిభాషలో రాసినటువంటి యోహానుసువార్త ప్రతిని అక్కడ విడచి పెట్టివెళ్ళాడు. తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగానికి సువార్త సేవ చేయడానికి వెళ్ళాడు. తర్వాత ఆసియామైనర్లో ఉన్న "హియరోఫాలి" పట్టణ మందు సువార్త సేవ చేసిన తన స్నేహితుడు అపోస్తులుడైన "ఫిలిప్పు" తో కొంత కాలం సువార్త సేవ చేసాడు. పిలిప్పుతో కూడ శిక్షవిధించబడి ఏదో ఒక కారణం చేత ఆఖరి నిమిషంలో విడుదల చేయబడ్డాడు కానీ, పిలిప్పు మాత్రం "హతసాక్షిగా" మరణించాడు.!

ఆ తరువాత తూర్పు దిశలో పయనించి "బర్తలోమయి" క్రీస్తు శకము 60 లో "అర్మానియా" దేశమందు తన సువార్త సేవను తిరిగి  ప్రారంభించాడు.అప్పటికే అపోస్తులుడైన తద్దయి (Thaddeus) క్రీస్తు శకం 43 లో సేవ ప్రారంభించి సంఘమును స్థాపించియున్నాడు. తద్దయి, బర్తలోమయి అనే ఇద్దరు అర్మానియా సంఘ పితరులు గా పిలువబడుతున్నారు. క్రీస్తు శకము 66 లో వేల కొలది క్రైస్తవులతో సహా "తద్దయి" హతసాక్షిగా మరణించాడు. ఆయనతో పాటు ఎంతో మంది క్రైస్తవులు హత సాక్షులుగామరణించారు. అయితే బర్తలోమయి తన సువార్త సేవను కొనసాగించాడు. అక్కడ పరిపాలిస్తున్న రాజు పోలిమియాస్ (Polymius)  యొక్క కుమార్తె మెదడు జబ్బుతో బాధపడుతుండగా బర్తలోమయి దేవుని ప్రార్ధించి ఆమెను స్వస్థపరిచాడు. అలాగే రాజు పూజించిన గృహలలో ఉండిన దెయ్యాలను కూడ వెళ్ళగొట్టాడు. రాజును అక్కడున్నటువంటి మరి కొందరును "బాప్తీస్మం" పొందారు. ఐతే అక్కడున్న శాస్త్రులు అధికారులు, పూజారులు కోపోద్రేక్రేులై రాజు యొక్క సహోదరుడైన "ఆష్టియోజిస్" కు మొరపెట్టారు. అతడు "బర్తలోమయి" బతి్రకియుండగానే చర్మాన్ని ఒలిచి ఆయనను తలక్రిందులుగా సిలువ వేయవలసిందిగా అజ్ఞాపించారు. విధంగా క్రీస్తు శకం 68 లో చాలా ఘోరమైన హింస తో కూడినటువంటి మరణం పొంది  "హతసాక్షిగా" మరణించాడు "బర్తలోమయి"

"బర్తలోమయిగా" పిలువబడుతున్న నతానియేలు యొక్క సమాధి "అర్మినియాలో" ఉంది. క్రీస్తు శకం 508 లో అనాస్టేషియస్క్రవర్తి ఆయన ఎముకలను పూరస్ తీసుకొనివెళ్ళాడు. అక్కడ నుండి లీబార్లెంకాపాన్వేండో తీసుకొని వెళ్లి ఎముకలను క్రీస్తుశకం 988 లో "రోమ్" కు తరలించారు. ఐతే పస్ర్తుతం ఈయన ఎముకలు టైపర్ నది ఒడ్డున ఉన్న (సెయింట్ ర్తలోమయి ఆలయములో) ఉన్నాయ్. ఈయన చేయి ఎముకలలో ఒకటి ఇంగ్లాండ్ దే మందు "క్యాటర్బరి" దేవాలయంలో ఉన్నది. విధంగా "బర్తలోమయిగా" పిలువబడే "నతానియేలు" అద్భుతమైన సేవ ను జరిగించి హింసతో కూడినటువంటి మరణాన్నిపొందుకున్నాడు. "హతసాక్షిగా"మరణించాడు.

*సర్వశక్తిగలదేవాతిదేవునికిమహిమకలుగునుగాక*





Post a Comment

0 Comments