నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది కీర్తనలు 139:3,4
మన ప్రవర్తన ఆయనకు తెలుసు:
మాటలు, చూపులు, తలంపులు, క్రియలు వీటన్నింటిని కలయికే "ప్రవర్తన"
మన ప్రవర్తన గురించి ఆయనకెట్లా తెలుసు? కారును తయారు చేసిన వానికి ఆ కారు గురించి తెలియకుండా ఉంటుందా? అట్లానే, మన హృదయాన్ని నిర్మించిన వానికి మన ప్రవర్తన గురించి తెలియకుండా ఎట్లా వుంటుంది? యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు. కీర్తనలు 33:13-15
*మన మాట నాలుకకు రాక మునుపే ఆయనకు పూర్తిగా తెలుసు: ఎందుకంటే? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుచే, హృదయం దేనితో నిండివుందో దేవునికి తెలుసు కాబట్టి. అయితే, ఎక్కువ సందర్భాలలో మన హృదయంలో ఉండేవి ఒకటి, బయటకి మాట్లాడేవి మరొకటి. వీటినే "కపటపు మాటలు" అంటాము.
ఇవి ఒక వేళ, మనుష్యులు కనిపెట్ట లేకపోవచ్చు గాని, ఆయనను మాత్రం మోసం చెయ్యలేము.
మనము మాట్లాడేవి నిజమైనవో? కపటమైనవో? అవి మన నోటినుండి బయటకు రాకముందే ఆయన గ్రహించగలడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆయన ఎంతటి శక్తి మంతుడో? ఆయనకు లోబడదాం! వ్యర్ధమైన, కపటపు మాటలకు దూరంగా ఉందాం! *ఆయనకు ఇష్టమైన ప్రవర్తనగలిగి జీవించుదాం!* ఆరీతిగా మన సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
Smug christ 8341543434
0 Comments