అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను అతనికి కావలసినవన్నియు ఇచ్చును. లూకా 11:8
ఇది మన జీవితంలో అత్యవసరమైన విషయాలను గురించి ప్రార్ధించే విధానం.
మాటి మాటికి అడగడం ఎందుకు?
ఆయనకు గుర్తుండదా?
అందరి ప్రార్ధనలు విని, ఎవరు ఏమి అడిగారో కన్ఫ్యూజ్ అయిపోతాడా?
లేకపొతే, ఆయనకు అడిగించుకోవడం సరదానా?
ఇవేమి కాదు.
నీవు అడిగేది నీకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి నిన్ను అడగమంటున్నాడు. ఇది కుడా కాదు ఈ వాఖ్యం చదవండి మత్తయి 10:13 ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. యేసు క్రీస్తు ప్రభువు వారు తన శిష్యులను సేవ చేయడానికి పంపినప్పుడు ఒక ఇంటిలో బస చేసినప్పుడు ఆ ఇంటికి అసిర్వచానములు ఇవ్వండి ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ ఇంటిమిడికి అసిర్వడం వచ్చును అని చెప్పారు అలాగే మనం అడిగే డానికి మనం యోగ్యులమా అని చూడాలి యోగ్యులం కాకపోతే మనలను మనం సరి చేసుకొని ప్రభువు దృష్టిలో యోగ్యతా సాధించాలి.
ఒక పిల్లవాడు ఫ్లైట్ చూస్తే అది కొనమంటాడు అలాంటిదే బొమ్మ ఫ్లైట్ వాడికి కొనిస్తాము అదే సైకిల్ చూసి అది కొనివ్వమంటే వాడికి తొక్కడం వచ్చారాదా చూసి కొంటాము వాడు సైకిల్ నేర్చుకునే వరకు రేపు కొంటాము రేపు కొంటాము అంటాము. వాడు సరేనంటాడు. మరళా రేపు దాని ప్రస్తావన వుండదు. కాని, వాడు సైకిల్ నేర్చుకున్నాక రేపు అంటే? రేపు తప్పకుండా అడుగుతాడు.అట్లా దానిని కొనేవరకూ అడుగుతూనే ఉంటాడు.అవసరమైతే ఏడ్చి మరీ కొనిపించుకుంటాడు. మనము కూడా అనేక సందర్భాలలో ఇట్లానే మనం అడిగే డానికి యోగ్యులమా కాదా అని ఆలోచించకుండా ఏదో ఒక రాయివేసి చూద్దాం అన్నట్లు ఒకసారి ప్రార్ధించి విడచిపెట్టేస్తాం. ఎందుకంటే అవి మనకు అంత అవసరం కాకపోవచ్చు. అయితే, కొన్ని విషయాలు మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనవి. వాటిని అట్లా ఒకటి, రెండుసార్లు ప్రార్ధించి విడచిపెట్టేస్తే పొందుకోవడం సాధ్యం కాదు. పొందుకొనే వరకు అడుగుతూనే వుండాలి. మనం అడిగిన దానిని పొండుకునే యోగ్యత మనకు వున్నదా అని ఆత్మ పరిశీలన చేసుకొని అందుకు కావలసిన యోగ్యత ప్రభువు దృష్టిలో సాధించి అప్పుడు మాటి మాటికీ దేవుని సన్నిధిలో అడుగుతూనే వుండాలి. నీవు ఎంత ఎక్కువగా అడిగితే అది నీకు అంత అవసరం అని అర్ధం నివు అంట మార్పు చెండుతున్నవని అర్ధం. నీవు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, పని చేస్తున్నప్పుడుకూడా అదే ధ్యాసలో వుండాలి. అట్లా నీ మనసుతో ప్రార్దిస్తూనే వుండాలి. నీ అవసరాన్ని గ్రహించిన దేవుడు ఇక ఆలస్యం చెయ్యక, తప్పక అనుగ్రహిస్తాడు. సిగ్గు లేకుండా మాటి మాటికి అడగాలట. అట్లా అడిగినప్పుడు మాత్రమే ఈ వాగ్ధానం నీ జీవితంలో నెరవేరుతుంది. అటువలె ( సిగ్గులేకుండా, మాటి మాటికి ) మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. లూకా 11:9
అంతేగాని, ఒకటి రెండుసార్లు అడిగినంత మాత్రాన అది మనకియ్యబడదు. వెదకినా దొరకదు. తట్టినా తీయబడదు. రాత్రివేళ తన స్నేహితుడు వచ్చి, సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతుండడంవల్ల కాదనకుండా రొట్టెలు తీసుకొనివచ్చి ఇస్తున్నాడు. మన 'స్నేహితుడు', అయిన యేసు ప్రభువు వారు మనము అడిగితే? కాదనగలడా? కాదనలేడు. కారణం? ఆయన మన ప్రాణ స్నేహితుడు మనకోసం తన ప్రాణమునే ఫణముగా పెట్టిన మంచి స్నేహితుడు, విడువక ప్రేమించే *'నిజమైన స్నేహితుడు'.* అందరూ విడిచినా, విడువక ఆదరించే *'గొప్ప స్నేహితుడు'.*
అడుగుదాం! అడగాల్సిన రీతిలో పొందుకుందాం! ప్రార్ధించినదానిని. అనుభవిద్దాం! ఆయన అనుగ్రహించినదానిని.
ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!
.
0 Comments