Ticker

6/recent/ticker-posts

తద్దయి_అనే_యూదా చరిత్ర

 

JUDAH_(THADHAI)

తద్దయి_అనే_యూదా

"యేసుక్రీస్తు" వారి యొక్క 12 మంది అపోస్తులలో "యూదా" అనేటువంటి పేరున్నవారు ఇద్దరున్నారు.

1.    తద్దయి  అనేటువంటి యూదా.

2.    ఇష్కరియోతు యూదా

అప్పగించినటువంటి "ఇష్కరియోతు యూదా" గురించి కాదు ఇప్పు డు వివరించేది. "తద్దయి" అనేటువంటి వేరొక "యూదా" గురించి. ఈయన ఇష్కరియోతు కానీ యూదా అని పిలువబడుతున్నా డు. (యోహాను సువార్త.14:22 వాక్యం చూడండి.) సెయింట్ జరేమాన్ అనే వ్యక్తి ఈయనని ఏమని పిలుస్తున్నాడంటే "ట్రయోనియస్" అని పిలుస్తున్నా డు.! ట్రయోనియస్ అంటే ఈయనకు మూడు పేర్లున్నా యని అర్ధం. అంటే మూడు పేర్లు గల వ్యక్తి అని అర్ధం..! ఈయనకు యూదా అనే పేరుతో పాటు "తద్దయి" "లెబ్బయి" అనే  పేర్లున్నా య్ గనుక,ఈయనకి యూదా తద్దయి లెబ్బయి అనే మూడు పేర్లున్నా య్ గనుక "ట్రయోనియస్" అని పిలుస్తున్నా డు.! ఈ పేర్లు (మత్తయి సువార్త.10:3 వ వచనంలో మనకు కనపడుతుంది.) "తద్దయి" అనేమాట "అరామిక్" నుంచి వచ్చి ంది. తద్దయి అనే మాట "ఘాట్" అనేటువంటి అరామియా మాట నుంచి వచ్చి ంది దానికి "రొమ్ము " అని అర్ధమిస్తుంది. "లెబ్బయి" అనే మాట "లెబ్" అనేటువంటి "హెబ్రి" మాట నుంచి వచ్చి ంది. ఈ మాటకు "హృదయం" అని అర్ధం ఈ 2 పేర్లను  కూడ చూస్తే ప్రేమకు పాత్రుడనే అర్ధమిస్తుంది. అంటే {ఈయన ప్రేమకు పాత్రుడు} అని. కొత్తనిబంధనలో యూదా అనే పేరు గలవారు చాలా మందోచ్ఛా రు.! అనేకమంది ఉన్నా రు.! వీరిలో "తద్దయి అనే యూదా" "ఇష్కరియోతు యూదా" యేసుక్రీస్తు యొక్క అపొస్తలులు వీరిద్దరు మాత్రమే. మరో యూదా కూడ ఉన్నా డు ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు.! (మత్తయి సువార్త.13:55 వ వచనం. ) (మార్కు సువార్త.6:3 వ వచనం.) ఆ వాక్యా లలో "యేసుక్రీస్తు" సహోదరుడైన "యూదా" గురించి తెలియపరుస్తుంది. ఆయనే  యూదా పత్రిక రాసెనని చెప్పబడుతున్నది. అంతేకాదు గలలీయుడైన యూదా గూర్చి కూడ (అపోస్తులకార్యములలో.5:37 లో కూడ ఉంది.) "యేసుక్రీస్తు" వారి అపొస్తులులైన ఇద్దరు యూదాలలో కూడ "తద్దయి" విశ్వా సంలో స్థిరంగా ఉండేవాడు.! దృఢమగు మనసు కలవాడు.! ఈయన ఇష్కరియోతు వలె దారి తప్పిపోలేదు.! యేసు గెత్సమనే తోటకు వెళ్లకమునుపు ఆయన యొద్ద ఆఖరిసారిగా అడగబడిన ప్రశ్నను "తద్దయి" అడిగాడు.! తన పునరుద్ధానం తరువాత శిష్యు లకు "పరిశుద్ధాత్మను" "ఆదరణ కర్తగా" పంపబోవుచున్నా నని "క్రీస్తు" తేటగా చెప్పు చుండిన సమయమది.! నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు.నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు.నేనును వానిని ప్రేమించి వానికి కనపరచుకొందును.అని చెప్పా డు

"యేసుక్రీస్తు" వారు. పరిశుద్దాత్మ ద్వా ర తాను ప్రత్యక్షపరచబడుటను గూర్చి "యేసుక్రీస్తు" వారు చెప్తున్నా రు..వెంటనే "యూదా" ప్రభువా నీవు లోకమునకు గాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరచుకొనుటకు ఏమి సంభవించెనని అడుగుతున్నా డు (యోహాను సువార్త.14:22 వాక్యంలో) ఈ ప్రశ్న శ్రేష్ఠమైన తత్వ జ్ఞానంతో కూడిన జవాబును పొందింది..యేసుక్రీస్తు ఆజ్ఞలను గైకొనుట ఎలా.? ఆయన మార్గములో నడుచుట ఎలా.? ఉత్తమ క్రైస్తవునిగా ఎలా జీవించాలి.? అన్ని టికి ఒకే ఒక్క జవాబు "యేసుని ప్రేమించాలి" అని. ఒకడు నన్ను ప్రేమించిన యెడల. అనేటువంటి మాట మనకు కనపడుతుంది. మనము ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన ఆజ్ఞలను గైకొనగలం.! ఆయన మార్గములో నడవగలం.! ఉత్తమ క్రైస్తవునిగా జీవించగలం.! యేసుక్రీస్తువారిని ప్రేమించువారికి ఆయన తనను తాను కనపరచుకుంటాడు. ఆయన జీవముగలవాడై తనలో నివసించుటను అతడు గ్రహించగలుగుతాడు. అతడు ప్రేమింపని లోకము ఆయన గుర్తింప జాలదు. క్రీస్తును ప్రేమించిన "తద్దయి" మిగిలిన అపోస్తులలో పాటు "పరిశుద్ధాత్మను" పొందుకున్నా డు.! (అపోస్తులకార్యములు.1:13 వచనం నుండి ఉంటుంది.) "యూదా" యొక్క సేవ. "తద్దయి" అనబడే ఈ యూదా యొక్క సేవను చూస్తే.. "యూసిపస్" అనే చరిత్రకారుడు తద్దయి "మెసపుటోమియా" రాజైన "అబ్హర్"కు "యేసుక్రీస్తును" బోధించినట్లు తెలియజేస్తున్నా డు.! అక్కడ రాజుతో సహా అనేకులకు రోగాలను బాగుచేసాడు. చాలామంది "క్రీస్తును" అంగీకరించారు. ఈ తద్దయి క్రీస్తు యొద్దకు చాలామందిని నడిపించాడు.! "అర్మినియా" ప్రాంతంలో ఐదుగురు అపొస్తలులు పరిచర్య చేసారు. ఈ అర్మినియా ప్రాంతంలో సేవ చేసిన ఐదుగురు అపోస్తులలో "తద్దయి" ఒకడు. "తద్దయి" "బర్తిలోమయికూడ "అర్మినియా" సంఘపు తండ్రులుగా పిలువబడుతున్నా డు.! క్రీస్తుశకం 43 వ సంవత్సరం నుండి 60 వరకు కూడ తద్దయి సేవ చేసాడు. 60 వ సంవత్సరం నుండి 68 వరకు కూడ బర్తలోమయి అర్మినియా లో సేవ చేసాడు. అది ప్రపంచంలోనే {మొదటి క్రైస్తవ} దేశం అయిపోయింది.! "ఏడిస్సా " అనే పట్టణంలో తద్దయి సేవ చేసేనని అర్మినియా సంఘ చరిత్ర చెప్తుంది. తద్దయి ఆ సంఘం యొక్క మొదటి తండ్రిగా ఎంచబడ్డాడు. "ప్యా ట్రిక్"గా ఎంచబడ్డాడు. తన సేవ యొక్క చివరి సంవత్సరాలకి తద్దయి పారసిక దేశమందు గడిపాడు. "కానానీయుడైన సీమోను" కూడ ఆయనతో సేవ చేసాడు. అక్కడ "సువానీల్" అనే స్థలంలో విగ్రహారాధన చేసినటువంటి ఒక గుంపువారు క్రీస్తుశకం 66 లో "సీమోనును" రంపంతో కోసి చంపేసారు. దాని తర్వా త "తద్దయిని" బల్లెములతో పొడిచి చంపేశారు. ఇద్దరి శరీరాలను ఒకే చోట పాతిపెట్టబడి యున్నట్లు చరిత్ర చెప్తుంది. "తాబ్రిస్" అనే పట్టణమునకు 40 మైళ్ళ దూరంలో కాస్మియన్ సముద్ర తీరమందలి కారకైలీసా అనే గ్రామంలో వారి సమాధి ఉంది. ప్రస్తుతము అది "ఇరాన్ దేశంలో" ఉంది.! ఈ విధంగా "తద్దయి అనేటువంటి యూదా" {విశ్వా సంలో} స్థిరంగా ఉండేవాడు.! దృడమనసు గలవాడు.! గొప్ప సేవ జరిగించాడు.! బల్లెములతో పొడిచి చంపేసారు. క్రీస్తు కొరకు "హతసాక్షిగా" మరణించాడు. "ప్రేమ సువార్తను" ప్రకటించి ప్రేమామయునిగా వచ్చి మనకు ప్రేమను అందించి,నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రేమమాయుడైన దేవాతిదేవునికి నిత్యము మహిమకలుగును గాక...!!!

AMEN.



Post a Comment

0 Comments