Ticker

6/recent/ticker-posts

విశ్వాసం కలిగి ఉండండి

విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.  (హెబ్రీయులు 11:1 *NKJV)
మన పరలోకపు తండ్రి మనలో ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసము వలననే అబ్రహాము ఎదురుచూడగలిగాడు. మనము పూర్తి విశ్వాసము లేకుండా జీవించు చున్నాము కనుక మనము ఇంకా కష్టాలలో వుండిపోతున్నాము. అందువలన బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది;  తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, అని నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. .  ( రోమన్లు ​​​​12:3 ) అయితే, దీన్ని  మనము క్షుణంగా అర్ధం చేసుకోవాలి. అంటే మన చుట్టూ వున్న పరిస్థితులు దేవుడు మనకు మన యడల అయన చిత్తము ప్రకారము అనుగ్రహించిన వాటిని మనం అర్ధం చేసుకోనకుండా ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని మన పౌర స్థితి బాగా ధనవంతులుగా వుండాలని అనుకుంటూ ఉంటాము. దేవుడు మనకు ఇచ్చిన దానిలో సంతృప్తి పడాలి మన పౌరస్థితి మార్పుచెంది రక్త సంభందముగా ఇజ్రాఏలియులకు అయన అనుగ్రహించిన విధముగా పాలు తేనెలు కలిగి వున్నా జీవితం కావాలి అంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం మనకు ఉచితంగా ఇవ్వబడింది, ఎలాగంటే;  కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.  (రోమన్లు ​​10:17)

 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 
17.ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. (రోమన్లు ​​1:16-17)

 కాబట్టి మనం విశ్వాసము కలిగి నీతిమంతులుగా జీవించడం చాలా ముఖ్యం ఎలా అంటే మేము చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము  ( 2 కొరింథీయులు 5:7 ) అనే అంతగా,  మన జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకు సహాయం చేస్తాడని విశ్వసించడం అనేది మన హృదయపూర్వకంగా జరగాలి.

 బైబిల్ గ్రంథం ఖచ్చితంగా ఈ విషయాని ఈ విధంగా చెబుతుంది;  విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీయులు 11:6)

కాబట్టి,  మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.  ( 2 దినవృత్తాంతములు 20:20 )

ఆమెన్, AMEN...




Post a Comment

0 Comments