Ticker

6/recent/ticker-posts

మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి

మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?

మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.

2 కొరింథీయులకు 13:5-6.

వారు అలా పరిశోధించే ప్రయత్నం చేస్తూ క్రీస్తు అతని ద్వారా మాట్లాడుతున్నాడో లేదో అని రుజువుల కోసం చూస్తున్నారు.

క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు. 2.కొరింథీయులకు 13:3

వారు తమను తాము పరిశోధించుకుంటే మంచిదని పౌలు అంటున్నాడు.అందులో వారు నెగ్గి క్రీస్తు వారిలో ఉన్నాడని రూఢీ చేసుకుంటే కనుక అతడు కూడా ఆ పరీక్ష గెలిచాడని వారు గుర్తుంచుకోవాలి.

 🌲ఆ పరీక్ష ఏమిటి క్రైస్తవులు తమను తాము ఎందుకు పరీక్షించుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలి, తాము విశ్వాసంలో ఉన్నామా, లేమో, అని చూసుకోవడమే ఈఆత్మ పరీక్ష ఉద్దేశం.

అంటే మనం దేవుని సత్యాన్ని అంగీకరించి, నమ్మి, ఆచరిస్తున్నామా? మనం నిజ క్రైస్తవులమేనా? లేక పేరుకు మాత్రమేనా?అని పరీక్షించుకోవాలి.

ఈ పరీక్ష చేసుకోవడం ఎలా? మన హృదయాల్లో కి తొంగి చూసుకొని అక్కడ ఏముందని చూడడం ద్వారా కాదు, అలా చూసుకుంటే.

👆👇

నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. రోమీయులకు 7:18

👆👉ఉన్నట్టు మాత్రమే కనిపించవచ్చు.

మరేలా పరీక్షించుకోవాలి

మన అనుభవాల ద్వారా, దేవుని వాక్కుద్వారా, మనం దానికి విధేయులమా?

అవిధేయులమా? అనేదాని ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి.

ఒక చెట్టుకున్న కాయల్ని బట్టే ఆ చెట్టును గుర్తించగలం.

మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మత్తయి సువార్త 7:18

మనకు క్రీస్తుతో ఎలాంటి అనుభవం లేకపోతే మన జీవితం ఆలోచనలు, చర్యలు, దేవుని వాక్కుకు భిన్నంగా ఉంటే మనం క్రీస్తుకు చెందినవారమని ఆధారమేమిటి?

కానీ మనకు క్రీస్తుతో కొంతైనా అనుభవం ఉంటే , ఆయన వాక్కకు లోబడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే, క్రీస్తు మనలో ఉన్నాడని తెలుసుకోగలం.

దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.1 యోహాను 3:10

విశ్వాసంలో ఉన్నామని రూఢీ చేసుకునేందుకు మనం చెయ్యవలసినదంతా చెయ్యాలి.

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.2 పేతురు 1:10

మనం ఈపరీక్ష నెగ్గలేకపోతే నిరాశ పడకూడదు .దానికి బదులుగా మన పాపాలకు పశ్చాత్తాపపడి.మన హృదయమంతటితో మనసారా క్రీస్తు వైపుకు తిరిగి ఆయన్ని విశ్వసించాలి.

అప్పుడు ప్రభువు

నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథము 3:10

అంటూ మనల చేయి విడువడు.

దేవుడు వాక్యమును చదివిన వారిని దీవించునుగాకా..ప్రభు సేవలో smug christ...


Post a Comment

0 Comments