*" మత్తు వలన నీ జీవితము చిత్తు "*
_యెషయా 19: 14
మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును
తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు_
మనిషి మత్తు వలన చిత్తు అవుతున్నాడు కారణము దాని వలన నాశనమే కలుగుతుంది కానీ ఉపయోగకరమైనది ఏమి లేదు అని గ్రహించక పోవడము మత్తు వలన ఆర్ధికంగా ఆత్మీయంగా నష్టము జరుగుతుంది
*-:- ఏమత్తు మనల్ని చిత్తు చేస్తుంది -:-*
*- మధ్యపు మత్తు*
ఆదికాండము 9: 21
పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై
తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను
*- ధన మత్తు*
1తిమోతికి 6: 10
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి
*- పాపపు మత్తు*
ఆదికాండము 19: 36
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు
తమ తండ్రివలన గర్భవతులైరి
*- నిద్ర మత్తు*
సామెతలు 23: 21
త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును
*- కామపు మత్తు*
2సమూయేలు 13: 2
తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.
*- నిర్లక్ష్యపు మత్తు*
మత్తయి 26: 40, 41
ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి... గమనించావా ప్రియమైన సహోదరి సహోదరులారా పాపము చేయడానికి మొత్తు ఎంతగా సహకరిస్తుంది. అనేక రకమైన మన పాపములు ఈ మత్తు వలన జరుగుతున్నవి. గనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు అలవాటు చేసుకోండి. పాపములో పడిపోవడంతో చాలా సులువు. దాని నుంచి విడుదల పొందటానికి అతి భయంకరమైన కష్టాన్ని పొందవలసి ఉంటుంది. ప్రియమైన వారులారా ఇప్పటికే మీరు పాపములో పడి ఉన్న ఎడల ఈ విధమైన మత్తు వలన మీరు పాపం లో పడి ఉన్నారు పరీక్షించుకుని దాని నుంచి విడుదల పొందటానికి సంసిద్ధులు కండి..
ప్రియమైన వారులారా రానున్న కొద్ది రోజులలో ఈ వర్తమానములు వీడియో రూపంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు ను మా కొరకు ప్రార్థన చేసి ఆత్మలో బలపరచు వలసిందిగా మనవి చేస్తున్నాం. ఇట్లు ప్రభువు సేవలో మీ సహోదరుడు smug christ...
8341543434...
0 Comments