. *ప్రేమను గురించి బైబిల్ ఏం చెబుతుంది?*
💕💞💕💞💕💕💕💞💕💞💕💞💕
మనం బైబిల్ చదివినపుడు, బైబిలంతటిలోనూ మనపై
దేవునికున్న ప్రేమ స్పష్టంగా కన్పిస్తుంది.
♥దేవుడు మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్♥
మరి ప్రేమంటే బైబిల్ ఏమని నిర్వచిస్తోంది?
1కొరింథీ13:4-13 లో ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి.
♥ ప్రేమ దీర్ఘకాలం సహించును
♥ ప్రేమ దయ చూపించును
♥ ప్రేమ మత్సరపడదు
♥ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
♥ ప్రేమ ఉప్పొంగదు
♥ ప్రేమ అమర్యాదగా నడవదు
♥ ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు
♥ ప్రేమ కోపపడదు
♥ ప్రేమ అపకారం చేయదు
♥ ప్రేమ సత్యమునందు సంతోషించును
♥ ప్రేమ అన్నిటికీ తాళుకొనును
♥ ప్రేమ అన్నిటినీ నమ్మును
♥ ప్రేమ అన్నిటినీ నిరీక్షించును
♥ ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును
♥ ప్రేమ శాశ్వతకాలముండును
♥ ప్రేమ దోషములన్నిటినీ కప్పును(సామెతలు10:12)
♥ ప్రేమ మరణమంత బలవంతమైనది(పరమగీతం8:6)
♥ ప్రేమ నిష్కపటమైనది(రోమా12:9)
♥ ప్రేమ పొరుగువారికి కీడుచేయదు(రోమా13:10)
♥ ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును(1కొరంథీ8:1)
♥ ప్రేమ యధార్థమైనది(2కొరంథీ8:24)
♥ ప్రేమ పాపములను కప్పును(1పేతురు4:8)
♥ ప్రేమ ప్రాణమును పెట్టును(1యోహాను3:16)
♥ ప్రేమ భయమును పోగొట్టును(1యోహాను4:18)
చూశారా! ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో!వివరించడం మాత్రమే కాదు గానీ, ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మనయెడల చూపాడు.
అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు
♥ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను(యిర్మియా31:3)
మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు.దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము(యోహాను5:41) , ఆయన మన కొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటవలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండిన వారమగుదుము.
♥ ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ(2యోహాను1:6)
♥ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే(రోమా13:10)
♥ ధర్మశాస్త్రమంతయూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది(గలతీ5:14)
లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియజేస్తుంది.పైకి ప్రేమ నటించుదురు గానీ అంతరంగమున లాభమును ఆశింతురు.
♥ నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గానీ, వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది (యెహెజ్కేలు33:31)
ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ ఛెబుతోంది.
♥ ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు(1కోరింథీ13: 3)
♥ అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును(మత్తయి24:12)
♥️మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి(1కొరంథీ16:14)
*ప్రేమంటే???*♥
ఈ ప్రశ్న యూత్ ను అడిగామనుకోండి!,
ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం, ప్రేమ గుడ్డిది, లాంటి ఇంకా చాలా మాటల చెబుతారు.
♡ మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకూ నిజాయితీ ఉంది?
♡ ప్రేమంటే అర్థం అంతేనా?
*లోకంలోని ప్రేమకు, దేవుడు చెప్పే ప్రేమకు ఎంత*
*తేడా ఉందో గమనించారా?*. ప్రేమను కలిగి ఉండటం క్రైస్తవునికి మొదటి లక్షణం.. ప్రేమలేని వాడు వ్యర్థుడు.. అనేక రకములైన ప్రేమలో దేవుని ప్రేమ అతి శ్రేష్టమైనది.. ఈ శ్రేష్టమైన ప్రేమను మీరు పొందగోరిన ఎడల ప్రతి రోజు దేవుని వాక్యము విని ఈ ప్రేమను పొందే భాగ్యమును మీకు అనుగ్రహిస్తుంది బైబిల్.. కనుక ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈ దినము నుంచి మీరు బైబిల్ ని చదవటము వాక్యము నేర్చుకోవలసింది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను..
0 Comments